• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

పేలుళ్లు: దర్యాఫ్తు సంస్థల్ని తప్పుపట్టిన అహ్మద్‌బుఖారి

By Srinivas
|

DSNR blasts: NIA's claim baseless, says Bukhari
లక్నో: ఇండియన్ ముజాహిదీన్ కార్యాలయం చిరునామా ఏమిటని? దాని కార్యకర్తలకు సంబంధించి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అని ఉంటే వాటిని బయట పెట్టాలని జామా మసీదు చీఫ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ డిమాండు చేశారు. పేలుళ్లకు పాల్పడింది ఇండియన్ ముజాహిదీన్ పనేనని జాతీయ దర్యాఫ్తు సంస్థ(ఎన్ఐఏ) వద్ద ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. బాంబు పేలుళ్లు జరిగిన ప్రతిసారీ దర్యాప్తు సంస్థలు ఎటువంటి దర్యాప్తు పూర్తి చేయకుండానే తొందరపడి కుట్రదారుల పేర్లను ప్రకటిస్తున్నాయని తప్పుబట్టారు.

హైదరాబాద్ పేలుళ్లలో ఇండియన్ ముజాహిదీన్ హస్తం ఉన్నట్లు తమకు దొరికిన ఆధారాలను బట్టి తెలుస్తోందంటూ ఎన్ఐఎ ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు. పేలుళ్లలో ఇండియన్ ముజాహిదీన్ హస్తం ఉంటే దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా అని అడిగారు. అధికార ప్రకటనలకు, ఆధారాలకు పొంతన లేదని, మాలేగావ్, మక్కా మసీదు, సంఝౌతా ఎక్స్‌ప్రెస్ ఘటనల్లో కూడా ప్రభుత్వ యంత్రాంగం అమాయక ముస్లిములను అరెస్టు చేసిందని ఆయన విమర్శించారు.

కాగా, ఢిల్లీలోని రద్దీ ప్రదేశాల్లో ఒకటైన ధౌలా కౌన్ ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఇద్దరు యువకులు మోటార్ సైకిల్‌పై వచ్చి ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రి సమీపంలో ఒక ల్యాప్‌టాప్ బ్యాగ్‌ను వదిలిపెట్టారని పోలీసులకు ఫోన్ రావడం, వెంటనే పోలీసులు అప్రమత్తమై బాంబుల జాడను పసిగట్టే శునకాలతో పాటు సైన్యంలోని బాంబు నిర్వీర్య దళాలు కూడా వెంటనే రంగంలోకి దిగి పరిశీలించిన విషయం తెలిసిందే.

బాంబు నిర్వీర్య దళం కూడా అక్కడకు చేరుకొని సాయంత్రం 5.20 గంటల సమయంలో బ్యాగ్‌ను ధ్వంసం చేశారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ దళాలతో పాటు ఢిల్లీ పోలీసులోని ప్రత్యేక విభాగానికి కూడా సమాచారం అందించగా వారు కూడా వెనువెంటనే అక్కడకు చేరుకున్నారు. అయితే, ఆ బ్యాగ్‌లో పేలుడు పదార్థాలు ఉన్నాయో లేవో శునకాలు తేల్చలేకపోయాయి. బ్యాగ్‌ను తెరిచేందుకు సైన్యం చిన్నస్థాయిలో పేలుడు జరపాల్సి వచ్చింది. బ్యాగులో కొన్ని ఇటుకలు, ల్యాప్‌టాప్ వైర్లు కనిపించాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary

 Delhi's Jama Masjid chief cleric Syed Ahmed Bukhari has said investigation agencies have the tendency to name perpetrators of any bomb blasts in the country much before initiation and conlusion of their probes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more