అభియోగాలకు సిబిఐ రెడీ: ఇప్పుడేనా.. జగన్ లాయర్

సిబిఐ ఆఖరు ఛార్జీషీటు దాఖలు చేయకుండానే అభియోగాలు ఎలా నమోదు చేస్తుందని జగన్ తరఫు లాయరు ప్రశ్నించారు. ఛార్జీషీట్లు పూర్తి కాకుండా అభియోగాలు నమోదు చేసే అధికారం కోర్టుకు లేదని వాదించారు. వాదనల అనంతరం మాత్రం అభియోగాలు నమోదు చేసేందురు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.
మరోవైపు జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ నిమిత్తం మంత్రి ధర్మాన ప్రసాద రావు బుధవారం ఉదయం నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. జగన్, ఓఎంసి, ఎమ్మార్ కేసు విచారణలో భాగంగా ఏఐఎస్ అధికారులు మన్మోహన్, శామ్యూల్‌తో పాటు కోనేరు ప్రసాద్, బిపి ఆచార్య, అయోద్య రామిరెడ్డి, రాజగోపాల్, విజయ సాయి రెడ్డిలు కోర్టుకు హాజరయ్యారు. వీరికి మార్చి 13వ తేది వరకు కోర్టు రిమాండును పొడిగించింది.
జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ బుధవారం సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ స్వీకరించిన సుప్రీం కోర్టు విచారణను మార్చి 1వ తేదికి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications