ఎమ్మెల్సీ ఎన్నికలు జగన్‌కు షాక్ ఇచ్చాయా?

కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం తిరిగి పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్సీ చిగురుపాటి వరప్రసాద్ ఓటమి పాలయ్యారు. స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. వైయస్సార్ కాంగ్రెసు పోటీ చేసినా మూడో స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానంలో కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయారు. ఈ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థి రవికిరణ్ వర్మ గెలిచారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కనుమిల్లి వెంకట సూర్యనారాయణ మూడో స్థానంలో నిలిచారు.
మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థి స్వామి గౌడ్ 92 శాతం ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అవే జిల్లాలకు చెందిన ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి తెరాస అభ్యర్థి పాతూరు సుధాకర్ రెడ్డి తొలి ప్రాధాన్యత ఓట్లతోనే మెజారిటీ సాధించి విజయాన్ని అందుకున్నారు.
నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి తెరాస అభ్యర్థి వరదా రెడ్డి ఓడిపోయారు. దీంతో తెరాసకు ఎదురు దెబ్బ తగిలిందనే మాట వినిపిస్తోంది. ఇక్కడ వరదారెడ్డికి, తెలంగాణ టీచర్ల జెఎసి అధ్యక్షుడు పూల రవీందర్‌కు మధ్య గట్టి పోటీ ఏర్పడింది. ఈ హోరాహోరీ పోరులో చివరికి ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా పూల రవీందర్ గెలిచారు.
వరదా రెడ్డిపై కొంత వ్యతిరేకతం ఉండడం ఒక కారణం కాగా, పూల రవీందర్ సకల జనుల సమ్మెకు నాయకత్వం వహించారు. తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెసు, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు పోటీ చేసేందుకు కూడా వెనకాడాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications