వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసంతృప్తితో తారుమారు: కాంగ్ జగన్ గజిబిజి(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెసు పార్టీని వీడి సొంత కుంపటి పెట్టుకున్న తర్వాత అధికార పార్టీలో తీవ్ర ప్రకంపనలు వస్తున్నాయి. అవి చిత్రంగాను ఉంటున్నాయి! ఒకప్పుడు జగన్‌ను, ఆయన పార్టీని తిట్టిన వారే ఇప్పుడు ఆ పార్టీలోకి వెళ్తారనే ప్రచారం లేదా ఆరోపణలు, గతంలో జగన్‌ను ఏమీ అనని వారు ఇప్పుడు ధ్వజమెత్తుతున్నారు.

రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. కానీ, తీవ్రంగా విభేదించిన వారి పైనే అంతకంటే తీవ్రమైన విమర్శలు, రాష్ట్రంలో అత్యున్నత స్థాయిలో ఉన్న వారికి వారితోనే విభేదాలు రావడం అంతా గజిబిజిగా ఉండటం గమనార్హం. ఇటీవలి వరకు జగన్ పార్టీలోకి వెళ్తారనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆళ్ల నాని, ద్వారంపూడి చంద్రశేఖర రావు, గొట్టిపాటి రవి కుమార్ తదితరులకు ప్రాధాన్యం ఇచ్చారు. కానీ వారు కాంగ్రెసుకు చేయిచ్చి జగన్ వైపు వెళ్లారు.

అయితే, జగన్‌తో తీవ్రంగా విభేదించిన మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి, మాజీ మంత్రి శంకర రావు తదితరులు వైయస్సార్ కాంగ్రెసుతో విభేదించే కాంగ్రెసు పార్టీ రాష్ట్ర పెద్దలకు లక్ష్యంగా మారడం గమనార్హం. జగన్ పైన డిఎల్ నిప్పులు చెరిగిన సందర్భాలు ఎన్నో. అలాంటి డిఎల్ జగన్ పార్టీలోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని వీరశివా రెడ్డి ఆరోపించారు. జగన్ పైన కోర్టుకెక్కిన శంకర రావు ఆ తర్వాత జగన్‌కు పాజిటవ్‌గా మాట్లాడిన సందర్భాలు ఆసక్తిని రేకెత్తించాయి.

అయితే, డిఎల్, శంకర రావులు మాత్రం కాంగ్రెసు పార్టీని వీడే అవకాశాలు ఎంతమాత్రమూ లేదనే చెప్పవచ్చు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో సైలెంట్‌గా ఉన్న వర్గపోరు కాంగ్రెసులో ఇటీవల తీవ్రస్థాయికి చేరుకుంది. ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు, చిరంజీవితో పాటు ఎన్నో వర్గాలు కాంగ్రెసులో ప్రస్తుతం కనిపిస్తున్నాయని అంటున్నారు. సహకార ఎన్నికల తర్వాత కిరణ్, డిఎల్ వర్గం వేడి మరోసారి రాజుకుంది. అయితే, ఇటీవల కాంగ్రెసు పార్టీలో కొత్త వాదన వినిపిస్తోందని అంటున్నారు. ఎవరికి ఎవరి పైన అసంతృప్తి కలిగినా జగన్ పార్టీలోకి వెళ్తారని ప్రత్యర్థి వర్గం ఆరోపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు మాత్రం జగన్ హవా కారణంగా పార్టీ మారుతుండటం విశేషం.

తారుమారు: కాంగ్‌లో 'జగన్' గజిబిజి(పిక్చర్స్)

వైయస్ హయాంలో సైలెంట్‌గా ఉన్నప్పటికీ ఆ తర్వాత కాంగ్రెసులో గ్రూపు రాజకీయాలు ప్రారంభమయ్యాయి.

తారుమారు: కాంగ్‌లో 'జగన్' గజిబిజి(పిక్చర్స్)

జగన్ సొంత కుంపటి పెట్టుకున్న తర్వాత కాంగ్రెసులో అంతా గజిబిజి కనిపిస్తోందనే చెప్పవచ్చు.

తారుమారు: కాంగ్‌లో 'జగన్' గజిబిజి(పిక్చర్స్)

కిరణ్‌కు దగ్గరగా ఉన్న పలువురు జగన్‌కు జై కొట్టారు

తారుమారు: కాంగ్‌లో 'జగన్' గజిబిజి(పిక్చర్స్)

జగన్‌తో విభేదించిన శంకర రావు, డిఎల్ రవీంద్రా రెడ్డిలు టార్గెట్‌గా మారారు!

తారుమారు: కాంగ్‌లో 'జగన్' గజిబిజి(పిక్చర్స్)

జగన్‌పై కోర్టుకెక్కిన శంకర రావు ముఖ్యమంత్రితో విభేదించి ఆ తర్వాత మంత్రి పదవి పోగొట్టుకున్నారు

తారుమారు: కాంగ్‌లో 'జగన్' గజిబిజి(పిక్చర్స్)

గతంలో జగన్‌పై నిప్పులు చెరిగిన డిఎల్ రవీంద్రా రెడ్డి ఆ తర్వాత కిరణ్‌తో వచ్చిన విభేదాల రావడంతో మంత్రి పదవిలో కోత పడింది. ఇప్పుడు ఏకంగా కిరణ్ వర్గం ఆయన జగన్ పార్టీలోకి వెళ్లే ప్రయత్నాలు అంటూ విమర్శలు గుప్పిస్తోంది.

తారుమారు: కాంగ్‌లో 'జగన్' గజిబిజి(పిక్చర్స్)

కిరణ్‌కు సన్నిహితంగా ఉంటున్న వారు జగన్ పార్టీలోకి వెళుతుండటం గమనార్హం. అయితే, కిరణ్‌కు సన్నిహితంగా అనడం కంటే వారు జగన్ పార్టీలోకి వెళ్తారని తెలిసి వారు అడిగిందల్లా కిరణ్ చేశారని అయినా వారు జగన్‌కు జై కొట్టలేకుండా ఉండలేకపోతున్నారని అంటున్నారు.

తారుమారు: కాంగ్‌లో 'జగన్' గజిబిజి(పిక్చర్స్)

కిరణ్, బొత్స, చిరుల మధ్య కూడా విభేదాలు ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, వారు వాటిని కొట్టి పారేశారు.

తారుమారు: కాంగ్‌లో 'జగన్' గజిబిజి(పిక్చర్స్)

సహకార ఎన్నికల్లో కాంగ్రెసు అభ్యర్థికి చిరంజీవి వర్గం మంత్రి అయిన సి.రామచంద్రయ్య సహకరించలేదనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కాంగ్రెసు వర్గాలు గుర్రుగా ఉన్నాయి.

English summary
The group politics are coming out in Congress party after YS Rajasekhar Reddy's death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X