ఐబి హెచ్చరిక: ఐమాక్స్, లుంబినీ ప్రాంతంలో తనిఖీలు

దీంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. దిల్‌సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల అనంతరం రాజధానిలో ఏదో ఒక పక్క బాంబు ఉందంటూ ఫోన్‌లు రావడం, నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో పోలీసు వర్గాలు అప్రమత్తమయ్యాయి. లుంబినీ పార్క్‌లో పోలీసులు తనిఖీలు జరిపారు. ఐమాక్స్ వద్ద ఆక్టోపస్ సోదాలు చేసింది. వనస్థలిపురంలో పోలీసులు తనిఖీల్లో రూ.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ పోలీసులు బుధవారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. రాష్ట్రంలో ఉగ్రవాదుల దాడులు జరుగవచ్చనే ఐబీ హెచ్చరికల నేపథ్యంలో ఈ దాడులు జరుగుతున్నాయి. అటు లుంబినీ పార్కులోనూ పోలీసులు తనిఖీలు జరుపుతున్నారు.
నిజామాబాద్ - కాచిగూడ ప్యాసింజర్ రైలులో బాంబు ఉన్నట్లు కలకలం చెలరేగింది. దీంతో బాంబు స్వ్కాడ్ అక్కడకు నిజామాబాద్ రైల్వే స్టేషన్లో రైలును నిలిపి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. బాంబు లేదని తేలడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. ఎవరో వదిలి వెళ్లిన రేడియోను చూసి ప్రయాణీకులు బాంబుగా భావించి పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం సదాశివనగర్ మండలం ఉప్పలవాయి రైల్వే స్టేషన్‌లో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది.
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications