హైకోర్టుకో 3 రోజులకు 3గురు ప్రధాన న్యాయమూర్తులు

ఇప్పటి వరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఈశ్వరయ్యను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ నుంచి పరిపాలనాపరమైన ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈశ్వరయ్య తర్వాత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ ఎన్‌వీ రమణ సోమవారం నుంచి ప్రధాన న్యాయమూర్తి నిర్వర్తించే పరిపాలనాపరమైన బాధ్యతలు నిర్వహించనున్నారు.
ఈ మేరకు కేంద్ర సంయుక్త కార్యదర్శి అనిల్ కుమార్ గులాటి పేరిట నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఒకటి రెండు రోజుల్లో జస్టిస్ రమణకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించేదాకా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఆయన కొనసాగనున్నారు.
మీ అభిమానం మరువలేను: జస్టిస్ ఘోష్
ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూపిన ఆదరాభిమానాలను మరువలేనని, ఆతిథ్యంలోనూ, ఆదరణలోనూ వారికి వారే సాటి అని జస్టిస్ పిసి ఘోష్ అన్నారు. సంస్కృతీ, సంప్రదాయాలను గౌరవించే ఈ రాష్ట్రాన్ని విడిచి వెళ్లడం బాధగానే ఉందని, ఆంధ్రపదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని ఆయన అన్నారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన ఆయనకు గురువారం హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు ఘనంగా వీడ్కోలు పలికారు. హైకోర్టు న్యాయవాదుల సంఘం జస్టిస్ ఘోష్‌ను ఘనంగా సన్మానించి, జ్ఞాపికను అందజేసింది.












Click it and Unblock the Notifications