కుమ్మక్కు: జగన్ పార్టీ నేతల మాట హరీష్ నోట

Harish Rao
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీపై వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు నోట వినిపించాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాసం తీర్మానం ప్రతిపాదించకపోతే కాంగ్రెసుతో తెలుగుదేశం పార్టీ కుమ్మక్కయినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు.

గోదావరి నదిపై మహారాష్ట్ర నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టుపై తమ మీద తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శానససభ్యుడు హరీష్ రావు తీవ్రంగా ప్రతిస్పందించారు. పోలవరం ప్రాజెక్టుపై తెలుగుదేశం పార్టీ ఎందుకు మాట్లాడడం లేదని, పోలవరం టెండర్లలో తెలుగుదేశం వాటా ఎంత అని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్రకు ఎంత ఇచ్చారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అడిగారు.

బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని, ఎవరు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించినా తాము మద్దతు ఇస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ కోసం తెలుగుదేశం పార్టీ చేసిన ఉద్యమాలు ఏమిటని, తెరాసపై బురద చల్లడమే ఉద్యమమా అని ఆయన అడిగారు. తెరాసను తిట్టడం తప్ప తెలంగాణ కోసం టిడిపి చేసిన పోరాటం ఏమీ లేదని అన్నారు.

చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని ఆయన ఎర్రబెల్లి దయాకర్ రావుకు సలహా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించకపోతే కాంగ్రెసుతో కుమ్మక్కయినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలుగుదేశం కంటికి రెప్పలా కాపాడుతోందని ఆయన అన్నారు. బాబ్లీ ప్రాజెక్టుపై తెలుగుదేశం నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన విమర్శించారు.

తమ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావును, తమ పార్టీ నేతలను పరుగెత్తించాలని ఎర్రబెల్లి దయాకర్ రావు అంటున్నారని, తెలుగుదేశం పార్టీ నేతలను పరుగెత్తించి కొట్టినా బుద్ధి రాలేదని ఆయన వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+