టిఆర్ఎస్‌ని తరిమికొట్టండి: ఎర్రబెల్లి, కెసిఆర్‌కే నాగం ఓటు

ఈ ఆందోళనలో టిడిపి సీనియర్ నేత, టిడిపి తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర రావు మాట్లాడారు. కెసిఆర్, హరీష్ రావులు కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా ఉన్నప్పుడే మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టును నిర్మించిందని ఆరోపించారు. మంత్రులుగా ఉన్న వారు అప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. తెరాస మహారాష్ట్రకు అనుకూలంగా ఉందని ఆయన ఆరోపించారు.
మహారాష్ట్రకు అనుకూలంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితిని తెలంగాణ ప్రాంతం నుండి తరిమి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. బాబ్లీ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వం అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి బాబ్లీ విషయంలో రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లితో పాటు కమలాకర్ రావు, రమణ, రమణ రావు తదితరులు పాల్గొన్నారు. కాగా, బాబ్లీ ప్రాజెక్టు విషయంలో ఇటీవల జాతీయ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో మహారాష్ట్రకు అనుకూలంగా తీర్పు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై తెలుగుదేశం పార్టీ వరుస ఆందోళనలకు పిలుపునిచ్చింది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపికే ఓటు
వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను తెలంగాణ రాష్ట్ర సమితికే వేస్తానని నాగర్ కర్నూలు శాసనసభ్యుడు, తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్ధన్ రెడ్డి హైదరాబాదులో అన్నారు. పోలవరం టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం అక్రమాలపై సిబిఐతో విచారణ జరిపించాలన్నారు. రాష్ట్ర పాలకులకు ఢిల్లీకి తిరగడంతోనే సమయం సరిపోతుందన్నారు.












Click it and Unblock the Notifications