పరువు హత్య, కూతురును పొట్టన పెట్టుకున్న తండ్రి

తిమ్మంపేటకు చెందిన మ్యాకల భిక్షపతి మూడో కూతురు పద్మ (20) డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. కొంతకాలంగా శ్రావణ్ అనే యువకుడితో ప్రేమలో పడింది. వీరిద్దరివీ వేర్వేరు కులాలు. కూతురు ప్రేమ విషయం తెలిసిన భిక్షపతి మండిపోయాడు. శ్రావణ్ తల్లిదండ్రులను పిలిపించి, తన కూతురు జోలికి రావొద్దని, మీ కుమారుడి పద్ధతి మార్చాలని హెచ్చరించాడు.
తన కూతురు పద్మకు పెళ్లి చేయాలని నిర్ణయించి, 20 రోజుల కిందట ఆమెకు సంబంధం కూడా చూశాడు. అయినా, పద్మ-శ్రావణ్‌ల ప్రవర్తనలో మార్పు రాకపోవడాన్ని గ్రహించాడు. తన బంధువులను వెంటబెట్టుకొని బుధవారం శ్రావణ్ కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి హెచ్చరించాడు. ఈ సందర్భంలో శ్రావణ్ దురుసుగా మాట్లాడడంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది.
దీంతో తన పరువు బజారున పడిందని, దీనికి కూతురే కారణమంటూ భిక్షపతి కోపంతో రగిలిపోయాడు. పద్మను చితకబాదాడు. పట్టరాని ఆవేశంతో ఆమె గొంతు నులిమాడు. దీంతో ఊపిరాడని పద్మ అక్కడికక్కడే మరణించింది. పోలీసులు గురువారం తెల్లవారుజామున గ్రామానికి వచ్చి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరువు పోతోందన్న ఆవేశంతో తానే చంపానని భిక్షపతి పోలీసుల ముందు అంగీకరించాడు.
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications