బాంబుందని మహిళ ఫోన్, కేసు: జిల్లా కోర్టులో కలకలం

బాంబు బెదిరింపు
రంగారెడ్డి జిల్లా మేడ్చల్ సమీపంలోని సిఎమ్మార్ ఇంజనీరింగ్ కళాశాలకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్ రెండు బృందాలతో తనిఖీలు చేపట్టింది. ఎలాంటి బాంబు లేకపోవడంతో ఆకతాయిల పనిగా భావిస్తున్నారు. ఫోన్ నెంబర్ ఆధారంగా వివరాలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. బాలానగర్‌లో అనుమానాస్పద టిఫిన్ బాక్సును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రంగారెడ్డి జిల్లా కోర్టులో బాంబు కలకలం
ఎల్బీ నగర్‌లోని రంగారెడ్డి జిల్లా కోర్టులో బాంబు కలకలం చెలరేగింది. పోలీసులు తనిఖీలు చేశారు. బాంబు లేదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆకతాయిలు ఈ పని చేసి ఉంటారని భావిస్తున్నారు.
వాహనానికి నిప్పు
మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ మండలం సంగంమండ వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ముఠా పైన రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. రెండు లారీలను, ఒక జెసిబిని స్వాధీనం చేసుకున్నారు. ఇసుక లారీలు పట్టుకున్నందుకు అక్రమార్కులు తహసీల్దారు వాహనాన్ని తగులబెట్టినట్లుగా చెబుతున్నారు.
రేషన్ బియ్యం పట్టివేత
శంషాబాద్ మండలం తొండుపల్లిలో అక్రమంగా లారీలో తరలిస్తున్న 270 బస్తాల చౌక బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. వాహనాన్ని పోలీసు స్టేషన్ తరలించారు. విచారణ చేపట్టారు. మరో ఘటనలోనల్గొండ జిల్లా కోదాడ మండలం కోమరబండ వద్ద రెండు వందల క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు.
నిలిచిన రైళ్లు
నల్గొండ జిల్లా భువనగిరి రైల్వే స్టేషన్ ఔటర్ సిగ్నల్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో సికింద్రాబాదు-కాజీపేట మార్గంలో నాలుగు ఎక్సుప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. గోరఖ్ పుర్, ఇంటర్ సిటీ, ఫలక్‌నుమా ఎక్సుప్రెస్‌లు భువనగిరి స్టేషన్‌లో, రాజధాని ఎక్సుప్రెస్ పగడిపల్లిలో నిలిచిపోయాయి.












Click it and Unblock the Notifications