వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తలదించుకోవాల్సొస్తుంది: సోనియా, పూలబాటే: ప్రధాని

By Srinivas
|
Google Oneindia TeluguNews

Manmohan Singh-Sonia Gandhi
న్యూఢిల్లీ: మహిళల పైన జరుగుతున్న దౌర్జన్యాలు, అత్యాచారాల వల్ల అవమానంతో తల దించుకోవాల్సిన పరిస్థితి వస్తోందని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం అన్నారు. మహిళల ప్రతిష్ట పెంచేందుకు రూ.1000 కోట్లతో నిర్భయ నిధిని ఏర్పాటు చేశామని ఆమె చెప్పారు. అంతకుముందు సభాపతి మీరా కుమార్ మాట్లాడుతూ... ఎలాంటి పరిస్థితుల్లోనైనా మహిళలు ధైర్యంగా ఉండాలని సూచించారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ ఆమె శుభాకాంక్షలు తెలిపారు. మహిళల భద్రత, ఆర్థిక, రాజకీయ, సామాజిక స్వావలంభన కోసం పార్లమెంటు కట్టుబడి ఉందని చెప్పారు. మహిళలు దీక్ష, పట్టుదలతో కష్టాలును ఎదుర్కొని విజయాలు సాధించాలన్నారు.

పూలబాట వేశాం

రాష్ట్రపతి ప్రసంగంపై రాజ్యసభలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మాట్లాడారు. ఆర్థిక సంస్కరణ అమలులో ఎలాంటి మార్పు లేదని చెప్పారు. ఆర్థిక సంస్కరణల ద్వారా ఆర్థికాభివృద్ధికి పూల బాట వేసినట్లు చెప్పారు. సంస్కరణలకు ప్రతిపక్షాలు సహృదయంతో సహకరించాలని కోరారు. విపక్షాల విమర్శలను పట్టించుకోమని, సంస్కరణలకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. భారత వృద్ధి రేటును పెంచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రధాని చెప్పారు.

వృద్ధి రేటు దేశానికి 8-9 శాతం అవసరమన్నారు. పేదరికం, నిరుద్యోగ నిర్మూలనే తమ లక్ష్యమన్నారు. సంక్షేమ రంగానికి యుపిఏ పెద్ద పీట వేసింది, తమ హయాంలోనే దేశం అభివృద్ధి బాట పట్టిందన్నారు. తీవ్రవాదంపై పోరులో ఎలాంటి రాజీ లేదన్నారు. విద్య, వైద్యం తదితర వాటిపై ఖర్చును పెంచామన్నారు. ఎన్‌సిటిసిపై ఏకాభిప్రాయం కోసం రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చిస్తామన్నారు.

- ప్రధాని, రాజ్యసభలో, రాష్ట్ర పతి ప్రసంగంపై, ఆఱ్థిక సంస్కరణ అమలులో మార్పు లేదు, పేదరికం నిరుద్యోగ నిర్మూలన లక్ష్యం, దేశానికి 8-9 శాతం వృద్ధి అవసరం, సంక్షేమ రంగానికి యుపిఏ పెద్దబీట, యూపిఏ హయాంలో అభివృద్ధి బాటట పట్టాం, సంస్కరణలకు ప్రతిపక్షాలు సహకరించాలి, తీవ్రవాదంపై పోరులో రాజీ లేదు, విద్య వవైద్యంపై కఱచ్చు పెంచాం, ఎన్ సిటిసిపై ఏకాభిప్రాయం కోసం రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చిస్తామని చెప్పారు. శ్రీలంకలో తమిళుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని, వారి సంక్షేమానికి అక్కడి ప్రభుత్వంతో కలిసి పని చేస్తామన్నారు.

English summary
Expressing confidence that growth would bounce back to 7-8 percent, Prime Minister Manmohan Singh said on Friday that the opposition should be more objective in assessing the work of the government. An acerbic Manmohan Singh also said "men of envy" disparage everything.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X