సెక్సిస్ట్ రిమార్క్స్: చిక్కులో మరో ఉత్తరప్రదేశ్ మంత్రి

కమలా నెహ్రూ సాంకేతిక సం్సథ కార్యక్రమంలో గతన నేల 56 ఏళ్ల పాండే ఐఎఎస్ అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సుల్తాన్‌పూర్‌కు చెందిన తాను ప్రతిసారీ అందమైన మహిళా జిల్లా మెజిస్ట్రేట్‌లతో కలిసి పని చేసే అవకాశం లభించినందుకు గర్విస్తున్నానని ఆయన అన్నారు. కె. ధనలక్ష్మి అనే ఐఎఎస్ అధికారిపై ఆ విధంగా ఆయన వ్యాక్యానించారు.
ఇంతకు ముందు కామిని చౌహన్ రతన్ ఉండేవారని, ఆమె అందానికి మరొకరు సాటి రారని అనుకునేవాడినని, ప్రస్తుతం ఆమె వారసురాలిగా వచ్చిన డిఎం ఆమెను మించిన అందగత్తె అని ఆయన అన్నారు. ఆమె సున్నితంగా కూడా మాట్లాడుతారని ఆయన అన్నారు.
లింగపరమైన, అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జాతీయ మహిళా కమిషన్ పాండేను వివరణ అడిగింది. సమాధానం ఇవ్వడానికి పాండేకు కమిషన్ 15 రోజుల గడువు ఇచ్చింది. అఫడవిట్ జత చేసి రాతపూర్వకంగా సవివరమైన సమాధానం ఇవ్వాలని కమిషన్ నిర్మలా సమత్ ప్రభావాల్కర్ ఆదేశించారు.












Click it and Unblock the Notifications