వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మావల్లే.. మేమే: కిరణ్ వర్సెస్ హరీష్, పివిపై చర్చ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy - Harish Rao
హైదరాబాద్: అవిశ్వాస తీర్మానంపై మాట్లాడుతున్న సమయంలో హరీష్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. తెలంగాణ అమరవీరులకు సంతాపం తెలుపలేదని హరీష్ అన్నప్పుడు గండ్ర స్పందిస్తూ... కిరణ్ కుమార్ రెడ్డి సంతాపం తెలిపారని, ఆత్మహత్యలు వద్దని సూచించారని గుర్తు చేశారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సిందే కేంద్రమే అన్నారు.

అందుకు హరీష్ మాట్లాడుతూ...ముఖ్యమంత్రి నిన్ననే విస్తరణ గురించి మాట్లాడారని, ఆయన మంత్రి పదవి కోసం చూస్తున్నట్లుగా ఉన్నారు. గండ్ర మాట్లాడుతూ.. కెసిఆర్ ప్రాపకం కోసం చూస్తున్నారన్నారు. అందుకు హరీష్ రావు మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమం కారణంగానే గండ్ర చీఫ్ విప్ అయ్యారని, పిసిసి చీఫ్, స్పీకర్, సిఎం ఇలా అందరూ సీమాంధ్రలే ఉన్నారన్నారు.

పివిని ప్రధాని చేశాం.... అవమానించారు..

అంతలో కిరణ్ కుమార్ రెడ్డి లేచి అసంతృప్తి వ్యక్తం చేశారు. అవిశ్వాసంపై చర్చించాలని సూచించారు. మిగతా విషయాల్లోకి వెళ్లవద్దన్నారు. కాంగ్రెసు పార్టీ పివి నరసింహా రావును ప్రధానమంత్రిని చేసిందన్నారు. తెలంగాణ ప్రాంతం వారికి ప్రాధాన్యత ఇచ్చిన ఘనత కాంగ్రేసుదే అన్నారు.

అందుకు హరీష్ మాట్లాడుతూ.. ప్రధానిగా ఎదిగిన పివిని అదే కాంగ్రెసు పార్టీ అవమానించిందన్నారు. ఆయనకు ప్రాధాన్యత ఇచ్చిన పాపాన పోలేదన్నారు. ఆయన సమాధికి ఢిల్లీలో గజం స్థలం ఇవ్వలేదన్నారు. కాంగ్రెసు పార్టీకి జీవం పోసిందే తెరాస అన్నారు. అందుకు కిరణ్ మాట్లాడుతూ పివి కుటుంబంతో మాట్లాడినట్లు చెప్పారు. తెరాస దయాదాక్షిణ్యాలతో మాకు పదవులు రాలేదన్నారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం వల్ల మాకు పదవులు వచ్చాయన్నారు. గతంలో మా దయాదాక్షిణ్యాల వల్ల మీకు మంత్రి పదవులు వచ్చాయన్నారు.

English summary
Telangana Rastra Samithi LP Etela Rajender has introduced No Confidence Motion in Assembly on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X