హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓటింగ్‌కు దూరం: అసదుద్దీన్, జగన్ పార్టీకి ప్రశ్న

By Pratap
|
Google Oneindia TeluguNews

Asaduddin Owaisi
హైదరాబాద్: అవిశ్వాస తీర్మానానికి దూరంగా ఉండాలని మజ్లీస్ నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ శుక్రవారం ప్రకటించారు. మీడియా సమావేశంలో మజ్లీస్ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ కూడా పాల్గొన్నారు. మజ్లీస్‌కు ఏడుగురు శాసనసభ్యులు ఉన్నారు. అవిశ్వాస తీర్మానం ద్వారా బిజెపి లాభపడాలని చూస్తోందని ఆయన అన్నారు. బిజెపి నేత నరేంద్ర మోడీ హైదరాబాద్ సభలో పాల్గొనడానికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు సిద్ధపడ్డారని ఆయన అన్నారు.

అవిశ్వాస తీర్మానానికి వైయస్సార్ కాంగ్రెసు బిజెపి మద్దతు ఎలా కోరుతుందని ఆయన అడిగారు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతు ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. తమకు రాజకీయ ప్రయోజనం ఉండదు కాబట్టి తెలుగుదేశం ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వలేదని ఆయన అన్నారు. బిజెపి, తెరాస ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతు ఇవ్వబోమని ఆయన స్పష్టం చేశారు.

ప్రధాన ప్రతిపక్షం లేకుండా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం ఇదే తొలిసారి అని ఆయన అన్నారు. తెలంగాణపై తెరాస, బిజెపిలకు భిన్నమైన విధానం తమకు ఉందని ఆయన చెప్పారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆయన విమర్శించారు. శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా ఉందని, అమాయకులైన ముస్లిం యువకులను వేధిస్తున్నారని ఆయన విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసుకు 1994లో పట్టిన గతే పడుతుందని ఆయన అన్నారు. హైదరాబాద్ లోకసభ స్థానం నుంచి కాంగ్రెసు అభ్యర్థిగా అజరుద్దీన్ పోటీ చేస్తే స్వాగతిస్తామని ఆయన చెప్పారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతు ప్రకటించింది. బిజెపి, సిపిఐ, సిపిఎం తదితర పార్టీలు దానికి మద్దతు తెలిపాయి. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం తటస్థంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈ స్థితిలో అవిశ్వాస తీర్మానంపై జరిగే ఓటింగుకు దూరంగా ఉండాలని మజ్లీస్ నిర్ణయం తీసుకుంది.

English summary
MIM chief Asaduddin Owaisi has stated that they will not participate in voting on No Confidence Motion proposed by Telangana Rastra Samithi (TRS) on CM Kiran Kumar Reddy's government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X