హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెరాస పట్టు: అసెంబ్లీ సోమవారానికి వాయిదా

By Pratap
|
Google Oneindia TeluguNews

Assembly
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), తెలుగుదేశం పార్టీ సభ్యులు శనివారం శాసనసభా కార్యక్రమాలను అడ్డుకున్నాయి. దీంతో సభ కార్యక్రమాలేవీ చేపట్టకుండానే సోమవారానికి వాయిదా పడింది. తెలంగాణపై తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ తెరాస సభ్యులు, బాబ్లీ ప్రాజెక్టుపై చర్చకు పట్టుబడుతూ తెలుగుదేశం సభ్యులు పట్టుబడుతూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. స్పీకర్ ఎంతగా సర్దిచెప్పినా వారు వినలేదు.

అంతకు ముందు శానససభా అదే కారణంతో రెండు సార్లు వాయిదా పడింది. శనివారం ఉదయం సభ సమావేశం కాగానే స్పీకర్ వాయిదా తీర్మానాలను తిరస్కరించారు. దీంతో ప్రతిపక్షాల సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో స్పీకర్ తొలుత సభను గంటపాటు వాయిదా వేశారు.

తిరిగి సమావేశమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. దాంతో మరో అర గంట వాయిదా వేశారు. మూడోసారి సభ ప్రారంభమైన తర్వాత కూడా సభ్యులు తమ పట్టు వీడలేదు. దీంతో సోమవారానికి స్పీకర్ సభను వాయిదా వేశారు.

బాబ్లీ ప్రాజెక్టుపై అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. సమావేశం ఎప్పుడు నిర్వహించేది ఈ రోజే చెప్తామని ఆయన అన్నారు. బాబ్లీ ప్రాజెక్టుపై చర్చకు తెలుగుదేశం పార్టీ సభ్యులు పట్టుబట్టడంతో ఆయన ఆ విషయం చెప్పారు. అయినా తెలుగుదేశం సభ్యులు వినలేదు. ముఖ్యమంత్రితో చర్చించి అఖిలపక్ష సమావేశం తేదీనీ తెలియజేస్తామని ఆనం చెప్పారు.

తెలంగాణ పట్ల కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని తెరాస శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. కాంగ్రెసు పార్టీ ఇప్పటికైనా వెకిలి మాటలు ఆపి తెలంగాణలోని సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ముక్కు పిండైనా ప్రాజెక్టులు, నిధులు దక్కించుకుంటామని ఆయన చెప్పారు.

English summary
The Assembly has been adjourned for Monday, as Telangana Rastra Samithi (TRS) and Telugudesam members stalled the proceeding on Telangana resolution and Babli project respectively.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X