వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సడక్ బంద్: సస్పెన్షన్ కోసం తెరాస ఎమ్మెల్యేల వ్యూహం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Harish Rao - Etela Rajendar - K T Rama Rao
హైదరాబాద్: సోమవారం నాడు జరిగే బడ్జెట్ ప్రసంగాన్ని అడ్డుకొని వేటు వేయించుకోవాలనే వ్యూహంలో తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రేపు బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నారు. ఆ రోజున సభను అడ్డుకోవాలని తెరాస భావిస్తోంది. బడ్జెట్ ప్రసంగం నేపథ్యంలో సభను అడ్డుకుంటే వాయిదా వేయరు. అడ్డుకున్న వారిని సస్పెండ్ చేస్తారు.

అలా తమపై వేటు వేయించుకొని సడక్ బంద్ కార్యక్రమానికి హాజరు కావాలని చూస్తోందట. గత బుధవారం బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున గవర్నర్ ప్రసంగాన్ని తెరాస సభ్యులు అడ్డుకున్నారు. గురువారం, శనివారం ఇతర విపక్షాలూ వివిధ అంశాలపై ఆందోళనకు దిగినా, ప్రధానంగా తెలంగాణపై తెరాస పట్టువల్లే సభ వాయిదా పడింది. సోమవారం కూడా అలాగే బడ్జెట్ ప్రసంగాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారట.

అలా అడ్డుకుంటే కనీసం నాలుగు రోజుల వరకు సస్పెండ్ చేయొచ్చు. ఆ సమయాన్ని ఈ నెల 21న తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి తలపెట్టిన సడక్ బంద్ కోసం వినియోగించుకోవాలని తెరాస ఎమ్మెల్యేలు భావిస్తున్నారట. ఒకవేళ సస్పెన్షన్ ఒకరోజే ఉంటే దాన్ని నిరసిస్తూ మరో మూడు రోజులు (19వ తేదీ సభకు సెలవు) సమావేశాలను బహిష్కరించాలని పార్టీ నాయకత్వం యోచిస్తోందట.

English summary
It is said that Telangana Rastra Samithi MLAs are thinking to protest Minister Anam Ramanarayana Reddy's Budget speech in the strategy of suspension.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X