న్యాయవాదిని దారుణ హత్య, పొలం తగాదాలే కారణం

కారు దిగి న్యాయవాది సర్వేశ్వరరెడ్డి పరుగులు తీశారు. జీపులోని వారు సర్వేశ్వరరెడ్డిని హత్యచేసేందుకు వెంటాడుతుండగా రామకృష్ణ అనేవ్యక్తి అడ్డుపడ్డాడు. ప్రత్యర్థులు అతనిని వేటకొడవళ్లతో గాయపరిచారు. ఆ తర్వాత సర్వేశ్వరరెడ్డి (60)ని వెంటాడి వేటకొడవళ్లతో తల, మెడ, చేతులపై నరికి దారుణంగా హత్య చేశారు. గాయపడిన రామకృష్ణను చికి త్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
లాయర్ సర్వేశ్వర్‌రెడ్డికి, నిందితులకు 20 ఏళ్లుగా పొలం తగాదా కోర్టులో నడుస్తోంది. గంగావరంలోని 43 ఎకరాల పొలాన్ని సర్వేశ్వరరెడ్డి 1992లో పద్మనాభరెడ్డికి విక్రయించి అడ్వాన్స్ తీసుకున్నారు. పద్మనాభరెడ్డి గడవులోగా డబ్బు చెల్లించకపోవడంతో సర్వేశ్వరరెడ్డి పొలం ఇచ్చేందుకు అంగీకరించలేదు. అప్పటి నుంచి ఈ వ్యవహారం ఆళ్లగడ్డ కోర్టులో నడుస్తోంది.ఈ కేసుకు సం బంధించి సర్వేశ్వరరెడ్డికి అనుకూలమైన తీర్పువస్తుందన్న సమాచారంతో ప్రత్యర్థులు ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పీజీ కోర్సు చదువుతుండగా సర్వేశ్వరరెడ్డి కూడా సహ విద్యార్థిగా ఉన్నారు. చంద్రబాబుతో ఇప్పటికీ అనుబంధం కొనసాగుతూ వస్తోంది. శిరువెళ్ళ మండలం గంగావరం గ్రామానికి చెందిన తొమ్మిది మందిపై హత్యకేసు నమోదు చేశారు. సంజీవరెడ్డి, అశోక్‌కుమార్‌రెడ్డి,జనార్థన్‌రెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి,అయ్యలూరు పోగుల లక్ష్మీరెడ్డి, విద్యాసాగర్‌రెడ్డి, నరేం ద్రరెడ్డి, వడ్డే వెంకటసుబ్బయ్యతోపాటు జీపు ఢీకొట్టిన ప్రమాదంలో మృతిచెందిన దస్తగిరిరెడ్డిలపై కేసు నమోదు చేసినట్లు రూర ల్ పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications