వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అత్యాచారం... పెళ్లి పేరుతో మోసం: వ్యక్తికి పదేళ్ల జైలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Man sentenced to 10 years in jail
న్యూఢిల్లీ/లక్నో/హైదరాబాద్: యువతిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ఓ యువకుడికి న్యాయస్థానం పదేళ్ల శిక్ష విధించింది. ఈ ఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగింది. అరుణ్ కుమార్ అనే వ్యక్తి ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. కానీ మోసం చేశాడు. 2003 అక్టోబరులో బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి హామీ నిలబెట్టుకోలేదు. అతనికి అప్పటికే పెళ్లయిందని తెలిసింది.

ఈ విషయమై కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. నిందితుడు.. అరుణ్ కుమార్ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డట్లు విచారణలో రుజువైందని అదనపు సెషన్స్ న్యాయమూర్తి చెప్పారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన అనంతరం అరుణ్ కుమార్‌కు పదేళ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తున్నట్లు చెప్పారు.

మరదలిపై బావ దాష్టీకం

తాగి అత్తవారింటికి వచ్చిన అల్లుడు మరదలిపై అత్యాచారం చేసి హతమార్చాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. రాజు అనే వ్యక్తి ఆదివారం అత్తగారింటికి వచ్చాడు. భార్య బంధువుల ఇంటికి వెళ్లడంతో రాత్రి అక్కడే ఉన్నాడు. అత్తమామలు నిద్రిస్తున్న సమయంలో మరదలిపై అత్యాచారం చేసి చంపేశాడు.

ఆ తర్వాత పని ఉందని చెప్పి ఇంటి నుండి పారిపోయాడు. ఉదయం బాలిక తల్లిదండ్రులు తమ కుమార్తె చనిపోయినట్లు గుర్తించారు. అల్లుడి నిర్వాకం వల్లే చనిపోయిందని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వికారాబాద్ పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.

English summary

 A 30 year old man has been sent to jail for ten years by a fast track court of New Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X