LPG: కేంద్రం అత్యవసర ఆదేశాలు! నెలకు సరిపడా దాచండి!

పశ్చిమ ఆసియా (మిడిల్ ఈస్ట్)లో రేగుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు భారతీయ వంటగదిపై ప్రభావం చూపేలా కనిపిస్తున్నాయి. నిత్యం కోట్లాది ఇళ్లలో వెలిగే గ్యాస్ స్టవ్ వెనుక ఎంతటి పెద్ద అంతర్జాతీయ సంక్షోభం దాగుందో ప్రస్తుత పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. యుద్ధం కారణంగా తలెత్తిన ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (LPG) సరఫరా ఇబ్బందులు.. దేశంలో అత్యవసర గ్యాస్ నిల్వలు (LPG Buffer Stocks) ఉంచుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేశాయి.

ఈ నేపథ్యంలోనే గృహ అవసరాలకు గ్యాస్ కొరత రాకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. దేశీయ మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా కనీసం 30 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలను సిద్ధం చేయాలని ఇండియన్ ఆయిల్ (IOCL), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL) వంటి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలను (OMCs) కేంద్రం ఆదేశించింది.

ప్రారంభ దశలో కసరత్తు.. భూగర్భంలోనా? ఉపరితలంలోనా?

కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ ఈ వ్యూహాత్మక నిల్వలపై కీలక విషయాలు వెల్లడించారు. ఈ ప్రతిపాదన ప్రస్తుతానికి ప్రాథమిక చర్చల దశలోనే ఉందని, ఇది పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుందనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. అయితే, మన దేశానికి ముడి చమురు (Crude Oil) దాచుకోవడానికి వ్యూహాత్మక భూగర్భ నిల్వ కేంద్రాలు ఉన్నప్పటికీ, ఎల్పీజీ (LPG) లేదా ఎల్‌ఎన్‌జీ (LNG) కోసం అలాంటి ప్రత్యేక సదుపాయాలు లేవు. ఈ నేపథ్యంలో, అదనపు గ్యాస్ నిల్వలను ముడి చమురు తరహాలోనే భూగర్భ గుహల్లో దాచాలా? లేక ఉపరితల ట్యాంకుల (Surface Tanks) ద్వారా నిల్వ చేయాలా? అనే అంశంపై చమురు సంస్థలు ఖర్చు, సాధ్యాసాధ్యాలను బట్టి ఒక తుది నిర్ణయానికి రానున్నాయి.

Government Asks Oil Companies to Build 30-Day LPG Reserves Underground LPG Caverns May Be Planned

హార్ముజ్ జలసంధి ముప్పు.. 60 శాతం దిగుమతులపైనే ఆధారం!

భారతదేశంలో దాదాపు 33 కోట్ల కంటే ఎక్కువ కుటుంబాలకు వంట గ్యాసే ప్రధాన ఇంధనం. అయితే, మన దేశానికి అవసరమయ్యే మొత్తం ఎల్పీజీలో దాదాపు 60 శాతం గ్యాస్‌ను మనం ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. ఇందులో అత్యంత ఆందోళనకరమైన విషయం ఏంటంటే.. మనం చేసుకునే దిగుమతుల్లో 90 శాతం గ్యాస్ పశ్చిమ ఆసియాలోని 'హార్ముజ్ జలసంధి' (Strait of Hormuz) మార్గం గుండానే భారత తీరానికి చేరుకోవాల్సి ఉంటుంది.

గ్యాస్ సబ్సిడీ కట్!
గ్యాస్ సబ్సిడీ కట్!

ప్రస్తుతం అక్కడ యుద్ధ వాతావరణం నెలకొనడం, హార్ముజ్ జలసంధి మూతపడే పరిస్థితులు రావడంతో గ్యాస్ సరఫరా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ఈ అంతరాయం వల్ల ఇప్పటికే పారిశ్రామిక, వాణిజ్య (Commercial) వినియోగదారులకు గ్యాస్ సరఫరాను తగ్గించాల్సి వచ్చింది. అలాగే సామాన్యుల ఇళ్లలో ఇబ్బందులు రాకుండా చూసేందుకు, గృహ వినియోగదారుల రీఫిల్ బుకింగ్‌ల (Gas Cylinder Bookings) మధ్య ఉండే కనీస కాల వ్యవధిని కూడా అధికారులు పెంచారు.

దేశీయంగా పెరిగిన ఉత్పత్తి.. ప్రత్యామ్నాయాల వేట!

యుద్ధం తెచ్చిన ఈ దిగుమతుల నష్టాన్ని భర్తీ చేయడానికి భారతీయ రిఫైనరీలు అప్రమత్తమయ్యాయి. ముడి చమురు నుంచి దేశీయంగా తయారు చేసే ఎల్పీజీ ఉత్పత్తిని గణనీయంగా పెంచాయి. యుద్ధానికి ముందు దేశీయ ఉత్పత్తి మన అవసరాలలో కేవలం 40 శాతం మాత్రమే తీర్చేది, కానీ ఇప్పుడది రోజుకు 50,000 నుండి 52,000 టన్నులకు చేరింది.

భారత్ లో LPG గ్యాస్ సిలిండర్ షార్టేజ్ ఉందా..??
భారత్ లో LPG గ్యాస్ సిలిండర్ షార్టేజ్ ఉందా..??

దీనివల్ల ప్రస్తుత దేశీయ డిమాండ్‌లో 70 శాతం వరకు మన సొంత ఉత్పత్తి ద్వారానే సరిపోతోంది. మిగిలిన కొరతను అధిగమించడానికి కేవలం పశ్చిమ ఆసియా దేశాలపైనే ఆధారపడకుండా.. అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా వంటి ఇతర ప్రత్యామ్నాయ దేశాల నుండి ఎల్పీజీ కార్గోలను (నౌకలను) రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+