గూగుల్ సమ్మిట్‌లో మోడి ప్రసంగం: సిఎంలలో ఒక్కరే..

నరేంద్ర మోడి ప్రసంగానికి ముందు అతను గూగుల్ చైర్మన్ ఎరిక్ స్మిత్‌తో మాట్లాడుతారు. దీనిని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. భారత దేశానికి చెందిన ముఖ్యమంత్రులలో ఈ సమ్మిట్‌లో పాల్గొంటున్నది కేవలం నరేంద్ర మోడి మాత్రమే. మోడి సోషల్ మీడియాలో బాగా ఆదరణ పొందుతున్న విషయం తెలిసిందే. ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి సామాజిక వెబ్ సైట్లలో దేశ రాజకీయ నాయకులలో మోడి అందరికంటే ముందున్నారు.
ఈ సమ్మిట్‌లో బ్రిటిష్ వార్తా పత్రిక ది గార్డియన్ చీఫ్ ఎడిటర్ అలెన్, స్టీఫెన్ కట్టర్ తదితరులు పాల్గొంటున్నారు. స్టీఫెన్ కట్టర్ 2008 నుండి 2012 వరకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రచార వింగ్‌కు డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేశారు. భారత్ నుండి ముఖ్యమంత్రిలలో ఒక నరేంద్ర మోడికి మాత్రమే ఈ సమ్మిట్‌లో మాట్లాడేందుకు ఆహ్వానం వచ్చిందని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
బిగ్ టెంట్ సమ్మిట్స్‌ను గూగుల్ నిర్వహిస్తోంది. అత్యుత్తమ బుద్ధిజీవులు, రాజకీయ నాయకులు, ఆలోచనాపరులను ఒక్కతాటి పైకి తీసుకు వచ్చి వారితో ఈ సమ్మిట్‌లో రాజకీయాలు, సంస్కృతి, ఆర్థిక విధానం, విద్య తదితర వివిధ అంశాలపై ప్రసంగింపచేయనుంది. ఈ సమ్మిట్ న్యూయార్క్, లండన్, బర్లిన్, మాడ్రిడ్, నైరోబీ, మాస్కో, సియోల్ తదితర పట్టణాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా జరుగనుంది.












Click it and Unblock the Notifications