గొట్టిపాటికి జగన్ ఝలక్!: అద్దంపై హామీ ఉందన్న నేత

YS Jagan - Gottipati Ravi Kumar
హైదరాబాద్: ప్రకాశం జిల్లా అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవి కుమార్‌కు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఝలక్ ఇచ్చారా? అంటే కావొచ్చు. అద్దంకి సీటు పైన ఎప్పటి నుండో ఆశలు పెట్టుకొని పార్టీలో కొనసాగుతున్న గరటయ్యకు ఆ సీటుపై వైయస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారట. అతనికే ఇస్తానని మొదటి నుండి చెప్పుకొస్తున్నారట.

ఈ రోజు హైదరాబాదులో గరటయ్య మాట్లాడుతూ.. అద్దంకి సీటు పైన వైయస్ జగన్ తనకు హామీ ఇచ్చారని చెప్పారు. గొట్టిపాటి రవి కుమార్ పార్టీలో చేరారు కదా, ఆయన కూడా అదే సీటు కోసం అడుగుతున్నారు కదా అని ప్రశ్నిస్తే... గొట్టిపాటి ఎక్కడి నుండి పోటీ చేస్తారో తనకు తెలియదని, తనకు మాత్రం జగన్ నుండి అద్దంకి టిక్కెట్ పైన స్పష్టమైన హామీ లభించిందని చెబుతున్నారు.

మరోవైపు, దాదాపు నెల రోజుల క్రితం జగన్‌తో జైల్లో భేటీ అయిన గొట్టిపాటి ఆ తర్వాత మాట్లాడుతూ తనకు జగన్ అద్దంకి సీటుపై హామీ ఇచ్చారని చెప్పారు. తాను త్వరలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతానని చెప్పారు. అద్దంకి టిక్కెట్ పైన తనకు జగన్ హామీ ఇచ్చారని చెప్పారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రజల కోసం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. జగన్‌ను అన్యాయంగా, కుట్రపూరితంగా అవినీతి కేసులో ఇరికించి జైలులో పెట్టించారని తాను నమ్ముతున్నానని ఆయన చెప్పారు. తనకు జగన్ టిక్కెట్ పైన హామీ ఇచ్చారన్నారు. ఆయన చెప్పిన తర్వాత అద్దంకి గొడవ హైదరాబాద్ కేంద్ర కార్యాలయానికి కూడా చేరుకున్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+