వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒక్కరికి ఒకే పదవి: బొత్స జాక్‌పాట్, మినహాయింపు

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: ఒక్కరు ఒకే పదవిలో ఉండాలనే నిబంధనను అమలు చేయడానికి కాంగ్రెసు అధిష్టానం సిద్ధపడుతున్న సమయంలో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాత్రం జాక్‌పాట్ కొట్టినట్లు తెలుస్తోంది. ఆయనకు ఆ నిబంధన నుంచి మినహాయింపు లభించినట్లు సమాచారం. ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉంటూనే మంత్రి పదవిలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

కాంగ్రెస్ పార్టీలో జోడుపదవులకు స్వస్తి పలకాల్సిన సమయం వచ్చిందని చెబుతున్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తీసుకొచ్చిన కొత్త ప్రతిపాదన మేరకు పార్టీ పదవిలోనో, ప్రజా ప్రతినిధిగానో ఏదో ఒక్కదానిలోనే కొనసాగే వీలుంది. జైపూర్ డిక్లరేషన్‌లో భాగంగా లోక్‌సభ ఎంపిలు, ఎమ్మెల్యేలు ఏకకాలంలో రెండు పదవులు నిర్వహించేందుకు వీల్లేదు.

డిసిసి, సిసిసి, పిసిసి అధ్యక్షులుగా ఉన్నవారు ఇకపై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధిష్ఠానం అనుమతించదు. దీంతో పలువురు ఎమ్మెల్యేలు పార్టీ పదవులను వదులుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం బొత్స సత్యనారాయణ పిసిసి అధ్యక్షుడిగా, మంత్రిగా జోడు పదవులు నిర్వహిస్తున్నారు. మంత్రి దానం నాగేందర్ కాంగ్రెసు గ్రేటర్ హైదరాబాద్ కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు డిసిసిల అధ్యక్షులుగా ఉన్నారు.

త్వరలోనే వీళ్లు ఏదో ఒకదాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. అయితే, పిసిసి అధ్యక్ష పదవిని నిర్వహిస్తున్న బొత్స ఇప్పటికిప్పుడు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం లేదని అంటున్నారు. ఆయన బాధ్యతలు తీసుకొనేప్పుడు జోడు పదవులు నిర్వహించేందుకు అధిష్ఠానం అంగీకరించింది. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో జోడు పదవులు నిర్వహించేందుకు కొందరికి మినహాయింపు ఉంటుందని పార్టీ సంస్థాగత వ్యవహారాలు సమీక్షించే ఆస్కార్ ఫెర్నాండెజ్ పేర్కొన్న సంగతి తెలిసిందే.

అయితే, రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి గురువారం అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ - 'పిసిసి చీఫ్ పదవిలో కొనసాగుతారా, మంత్రి పదవిలో ఉంటారా' అని తాను బొత్సను ప్రశ్నించానని, 'రెండునెలల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాన'ని బొత్స తనతో అన్నారని చెప్పారు.

English summary

 PCC Botsa Satyanarayana has been permitted to continue as president of PCC and as a minister. It is said that he has been excluded from Rahul Gandhi's rule.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X