వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపిలో కయ్యం: దూళిఫాళ్ల వర్సెస్ కొత్తకోట దయాకర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Kothakota Dayakar Redd - Dhulipala Narendra Choudhary
హైదరాబాద్: పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్రలో దూరంగా ఉన్న స్థితిలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల మధ్య కయ్యం జరిగింది. తెలుగుదేశం శానససభా పక్షం (టిడిఎల్పీ) విప్ దూళిపాళ నరేంద్ర చౌదరిపై పార్టీ శాసనసభ్యుడు కొత్తకోట దయాకర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.

ఆ సంఘటన గురువారం శానససభలో జరిగింది. కోపంతో తన చేతిలో ఉన్న పత్రాలను కొత్తకోట దయాకర్ రెడ్డి విసిరికొట్టారు. విద్యుత్ సమస్యపై తక్షణం చర్చ చేపట్టేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని టిడిపిఎల్పీ నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ముద్దు కృష్ణమ నాయుడు మాట్లాడారు. దీంతో కొత్తకోట విభేదించారు. తాగునీటి సమస్యకు తొలి ప్రాధాన్యం ఇస్తే ఉపయోగకరంగా ఉంటుందని ఆయన నరేంద్రతో వాదించారు. తన మాటను నరేంద్ర పట్టించుకోలేదని పేపర్లు విసిరికొట్టారు. ఇది చర్చనీయాంశంగా మారింది.

తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్రలో ఉన్న చంద్రబాబు తుమ్మల నాగేశ్వరరావుకు ఫోన్ చేసి అభినందించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో పాల్గొన్న తుమ్మల ప్రసంగానికి ఆ ప్రశంసలు దక్కాయి 'పార్టీ వాణిని బాగా వినిపించావు. నీ ప్రసంగం చాలా బాగుంది. హృదయాన్ని తాకేలా మా ట్లాడావు. అభినందనలు' అన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో అద్దంకి సీటుకు అభ్యర్థి ఎంపిక వ్యవహారం వేడి పుట్టించడంతో ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే గరటయ్య గురువారం ఇక్కడ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ లాబీల్లో ఆయనను మీడియా ప్రతినిధులతో అద్దంకి సీటు వ్యవహారం గురించి కదిపినప్పుడు తనకు ఆ సీటుపై పార్టీ నుంచి హామీ ఉందని గరటయ్య చెప్పారు.

English summary

 Telugudesam MLA Kothakota Dayakar Reddy has expressed anguish at TDLP whip Dhulipala Narendra Choudhary in assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X