వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంజయ్ దత్‌కి క్షమాభిక్ష ప్రసాదించండి: కట్జూ విజ్ఞప్తి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Markandey Katju
న్యూఢిల్లీ: ముంబయి బాంబు పేలుళ్ల కేసులో ఐదేళ్ల జైలు శిక్ష పడిన ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు క్షమాభిక్ష ప్రసాదించాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ మహారాష్ట్ర గవర్నర్ కె శంకర నారాయణన్‌కు గురువారం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఉదయం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ముంబై పేలుళ్ల కేసులో సంజయ్ పాత్ర ఉన్నట్లు ఆధారాలు లేవన్నారు.

ఈ మేరకు ఆయనను దోషిగా నిర్ధారించలేదన్నారు. అయినా, ఆయన ఇప్పటికే చాలా మనోవ్యథకు గురయ్యారని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 161 ప్రకారం ఆయనకు క్షమాభిక్ష ప్రసాదించాలని గవర్నర్‌ను కట్జూ కోరారు. లైసెన్స్ లేకుండా కేవలం అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారన్న కేసులోనే సంజయ్ దత్‌కు శిక్ష పడిన విషయాన్ని మార్కండేయ కట్జూ గుర్తు చేశారు. పేలుళ్లతో సంబంధం లేనందున సంజయ్ దత్‌కు క్షమాభిక్ష పెట్టే అవకాశం గవర్నర్ లేదా రాష్ట్రపతికి ఉందని ఆయన అన్నారు.

క్షమాభిక్ష చట్టం 161 కింద గవర్నర్ లేదా రాష్ట్రపతి క్షమాభిక్షను పెట్టవచ్చునని చెప్పారు. ఇప్పటికే సంజయ్ దత్ పదహారు నెలల జైలు శిక్ష కూడా అనుభవించారని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో సంజయ్ దత్ జైలు జీవితాన్ని తగ్గించేందుకు గవర్నర్ చొరవ తీసుకోవచ్చునని చెప్పారు. గతంలో ఓ మర్డర్ కేసులో నిందితుడికి గవర్నర్ క్షమాభిక్ష పెట్టిన సందర్భాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

సంజయ్ దత్‌కు పేలుళ్లతో సంబంధం లేదని, అతను కేవలం అక్రమాయుధాలు కలిగి ఉన్నందుకే సుప్రీం కోర్టు శిక్షను విధించిందన్నారు. మర్డర్ కేసు క్షమాభిక్ష కంటే ఇది అంతకంటే పెద్దదేమీ కాదని కట్జూ అభిప్రాయపడ్డారు. మర్డర్ కేసులో ఓ గవర్నర్ క్షమాభిక్ష పెట్టినప్పుడు ప్రస్తుతం గవర్నర్ సంజయ్ దత్‌కి క్షమాభిక్ష పెడతారని తాను ఆశిస్తున్నానని అన్నారు.

English summary
Following the upholding of the sentencing of film star Sanjay Dutt to five years imprisonment by the Supreme Court in 1993 Mumbai blasts case, Press Council of India chief Justice Markandey Katju has appealed to Maharashtra Governor K Sankarnarayanan to pardon the actor. In a statement issued in New Delhi, Katju sought pardon for Dutt under Article 161 of the Constitution saying that he had not been found guilty of having played a role in the 1993 blasts and had suffered a lot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X