Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఢిల్లీలోని అక్బరు రోడ్డులో చిరంజీవికి అధికారిక గృహం!

Minister Chiranjeevi
న్యూఢిల్లీ: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవికి త్వరలో హస్తినలో అధికారిక గృహాన్ని కేటాయించనున్నారు. కొంతకాలం క్రితం చిరంజీవికి పర్యాటక శాఖ(స్వతంత్ర)ను అప్పగించిన విషయం తెలిసిందే. అయనకు అప్పటి నుండి ఢిల్లీలో అధికారిక నివాసం లేదు. ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఓ ఇంటివారు కాబోతున్నారు. ఇప్పటి వరకు చిరంజీవి వసంత్ కుంజ్‌లోని తన స్నేహితుడి ఇంటి నుండే పార్లమెంటుకు హాజరవుతున్నారు.

ఇప్పుడు ఓ అధికారిక నివాసం ఇవ్వనున్నారు. దీంతో పార్లమెంటు అధికారులు ఆయనకు అక్బర్ రోడ్డులోని పదిహేడవ నెంబర్ బంగళాను కేటాయించారు. కాంగ్రెసు పార్టీలో ఉన్నప్పుడు కీలక భూమిక పోషించిన సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అర్జున్ సింగ్ ఈ ఇంట్లో పదిహేడేళ్లు నివసించారు. ఇప్పుడు చిరంజీవికి అది కేటాయించడంతో మరమ్మతులు చేపట్టారు.

మన చారిత్రక సంపదను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి చిరంజీవి శనివారం అభిప్రాయపడ్డారు. భారత పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలో రాత్రి ఫెస్టివల్ ఆఫ్ సౌత్ ఇండియా కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడారు.

మన సంస్కృతి, కళలు, సంప్రదాయాలు, ఆహారం, నృత్యాలు తదితర ప్రతి దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందన్నారు. ఇందుకోసం ఢిల్లీలో జరిగే అంతర్జాతీయ ఆర్ట్ ఫెస్టివెల్ రీతిలో దక్షిణాదిన జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు రెట్టింపు స్థాయిలో నిధులు సమకూర్చేలా ప్రయత్నాలు చేస్తామన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+