Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తేల్చండి: కోమటిరెడ్డి సోదరులకు జగన్ పార్టీ అల్టిమేటం!

Komatireddy Venkat Reddy - Rajagopal Reddy
హైదరాబాద్: నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి సోదరులకు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధిష్టానం అల్టిమేటం జారీ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. పార్టీలోకి వస్తున్నారా? లేదా? వారం రోజుల్లో తేల్చాలని సోదరులైన మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి, భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు పార్టీ ఆదేశించినట్లుగా చెబుతున్నారు.

పార్టీలోకి వస్తారో లేదో? వారం రోజుల్లోగా తేల్చాలని ఆదేశాలు జారీ చేశారట. అయితే, వారు మాత్రం మరికొద్ది నెలలు గడువు కోరారట. అక్టోబర్ లేదా నవంబరు వరకు పార్టీలోకి వస్తామని చెప్పారట. ఈలోగా తెలంగాణపై అనుకూల నిర్ణయం వెలువడితే, ఇప్పుడున్న పార్టీలోనే ఉంటామని కూడా జగన్ పార్టీకి చెప్పారట. కాంగ్రెసు తెలంగాణపై నిర్ణయం తీసుకోని పక్షంలో పార్టీలోకి వస్తామని చెప్పారట.

కాంగ్రెసు పార్టీ తెలంగాణపై తేల్చని పక్షంలో సమైక్య రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రి అయితే మంత్రివర్గంలో చేరవచ్చునని వారు భావిస్తున్నారట. కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పిఏసి) సోమవారం హైదరాబాద్‌లో భేటీ అవుతోంది. విద్యుత్ చార్జీల పెంపు, ఇతర అంశాలపై చర్చించడానికి ఈ సమావేశం జరుగుతున్నట్లు పార్టీ కార్యాలయం ఆదివారం తెలిపింది.

మరోవైపు.. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో పలు నియోజకవర్గాల్లో సమన్వయకర్తల గోల చెలరేగడంతో వరంగల్, ఖమ్మం తదితర జిల్లాల్లో పెండింగులో పెట్టారు. సమన్వయకర్తలు ప్రకటించిన చోటల్లా అసంతృప్తి రాజుకుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+