వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చావ్లా తర్వాత ఆందోళన, వెంట భగవద్గీత: విలియమ్స్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sunita Williams
న్యూఢిల్లీ: అంతరిక్షంలో తాను భారతీయ వంటకాలనే తీసుకునే దానినని భారత జాతి అమెరికా వ్యోమగామి సునితా విలియమ్స్ సోమవారం అన్నారు. సునిత విలియమ్స్ ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్నారు. ఢిల్లీ జాతీయ సైన్స్ సెంటర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. భారత వంటకాలపై తనకు మక్కువ ఎక్కువ అన్నారు. అంతరిక్షంలో భారరహిత స్థితిలో తాను సమోసాలను తిన్నానని చెప్పారు.

తన వెంట శ్రీమద్భగవద్గీత, ఉపనిషత్తులను ఉంచుకున్నానని ఆమె చెప్పారు. ఎంతగానో మద్దతునిచ్చే తన కుటుంబ సభ్యులు తనకు ఉన్నారని, ఇది తన అదృష్టమన్నారు. తన కుటుంబం సహకారంతోనే వ్యోమగామినయ్యానన్నారు. మరోసారి తాను అంతరిక్షంలోకి వెళ్లాలని అనుకుంటున్నట్లు చెప్పారు. కల్పనా చావ్లా మృతి తర్వాత తాను స్పేస్‌లోకి వెళ్లేందుకు తొలుత కొంత ఆందోళనకు గురయ్యానని చెప్పారు.

అంతరిక్షంలో తాను ఎంతో ఉత్కంఠగా గడిపానని చెప్పారు. స్పేస్‌లో ఉన్నన్నాళ్లు తన ఇంట్లోనే ఉన్నట్లుగా అనిపించిందన్నారు. స్పేస్ చాలా అద్భుతమైనదన్నారు. విద్యార్థులు తాము ఏది ఇష్టపడతారో అదే చిత్తశుద్ధితో చేయాలని ఆమె ఈ సందర్భంగా సూచించారు.

స్పేస్‌లో యాభై గంటల నలభై నిమిషాలు వాక్ చేసిన మహిళా వ్యోమగామిగా సునిత చరిత్ర సృష్టించారు. అంతేకాకుండా 322 రోజులు స్పెస్‌లో ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రికార్డులు అనేవి బ్రేక్ చేయడానికే ఉన్నాయని, యంగ్ జనరేషన్‌కు అవకాశమిస్తే రికార్డులు బ్రేక్ చేస్తారని తాను భావిస్తున్నానని అన్నారు. కాగా, సునిత ఏప్రిల్ 3, 4 తేదీల్లో ముంబయిలో ఉంటారు. ఆ తర్వాత తన తండ్రి సొంత రాష్ట్రమైన గుజరాత్ వెళ్లనున్నారు. సునిత 2007 అక్టోబర్‌లో చివరిసారి భారత్‌లో పర్యటించారు.

English summary
Space almost feels like home, Indian American astronaut Sunita Williams, who holds the record of the longest space walk by a woman astronaut, said here on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X