జగన్ కేసులో మరో ఛార్జీషీట్: సాయి 4 గంటల విచారణ

YS Jagan - Vijaya Sai Reddy
హైదరాబాద్/న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) ప్రత్యేక న్యాయస్థానంలో మంగళవారం అదనపు ఛార్జీషీటును దాఖలు చేసింది. ఈ ఛార్జీషీటు మొదటి ఛార్జీషీటుకు అనుబంధంగా వేశారు. మొదటి ఛార్జీషీటుకే ఇది రెండో అనుబంధ ఛార్జీషీటు. ఇందులో వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన పిసి యాక్టు 9 కింద అభియోగాలు నమోదు చేశారు. ఈ ఛార్జీషీటులో మొత్తం 9 మంది సాక్ష్యులను సిబిఐ ప్రస్తావించింది.

సాక్ష్యులలో ఆర్వోసి, ఎల్ఆర్వోసీలు ఉన్నాయి. 29 పేజీలతో కూడిన ఛార్జీషీటును వేసింది. ఎనిమిది డాక్యుమెంట్లు ఉన్నాయి. జగన్ కంపెనీతో హెటెరో డ్రగ్స్, ట్రైడెంట్, అరబిందో ఫార్మా తదితర ఫార్మా కంపెనీల వ్యవహారంపై ఈ ఛార్జీషీటును వేసింది. ఈ సంస్థలు జగన్ సంస్థలో ఆర్వోసి నిబంధనలను ఉల్లంఘించి పెట్టుబడులు పెట్టాయని అభియోగాలు నమోదు చేసింది. ఈ కంపెనీలు బినామీలుగా పెట్టుబడులు పెట్టాయని పేర్కొంది.

అందుకు ప్రతిగా మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లో భూములు పొందాయని పేర్కొంది. అనుబంధ ఛార్జీషీటులో ఆర్వోసిని సాక్షిగా పేర్కొంది. ఛార్జీషీటులో మొత్తం 13 మందిని నిందితులుగా పేర్కొన్నారు. జగన్ కంపెనీల్లో ఆయా ఫార్మా కంపెనీలు రూ.29.5 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లుగా పేర్కొంది. హెటెరో రూ.19.5 కోట్లు, అరబిందో రూ.10 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లుగా సిబిఐ తన ఛార్జీషీటులో పేర్కొంది.

ఈడి ముందుకు విజయ సాయి రెడ్డి

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో జగన్ ఆడిటర్ విజయ సాయి రెడ్డి ఈ రోజు(మంగళవారం) న్యూఢిల్లీలో ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యారు. ఈడి అధికారులు విజయ సాయి రెడ్డిని దాదాపు నాలుగున్నర గంటల పాటు విచారించారు. వాన్ పిక్ అంశంపై ఈడి విజయ సాయి రెడ్డిని ప్రశ్నించింది.

ఈ నెల 16వ తేదీన మరోసారి ఈడి విచారణకు హాజరవుతానని విజయసాయి రెడ్డి చెప్పారు. మొదటి అటాచ్‌మెంట్‌‍పై న్యాయప్రాధికార సంస్థ తీర్పును అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో సవాల్ చేశామని ఆయన చెప్పారు. వాన్‌పిక్‌కు సంబంధించిన నాలుగో చార్జిషీట్‌పై ఈడి అధికారులు తనను ప్రశ్నించినట్లు ఆయన తెలిపారు. విచారణ కొనసాగుతున్నప్పుడు అంశాలను మీడియాతో చెప్పడం భావ్యం కాదని విజయసాయి రెడ్డి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+