వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిఆర్ఎస్‌కు కెవిపితో సంబంధాలు: యాష్కీ సంచలనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Madhu Yashk
న్యూఢిల్లీ: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మబంధువు, కాంగ్రెసు పార్టీ సీనియర్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావుకు తెలంగాణ రాష్ట్ర సమితితో సత్సంబంధాలు ఉన్నాయని నిజామాబాద్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఢిల్లీలో తెరాస, కెవిపి పైన నిప్పులు చెరిగారు. అదే సమయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైఖరిని తప్పు పట్టారు.

ఎన్నికలకు సంవత్సరం ముందు కలలు కంటే తెలంగాణ రాదని ఆయన వ్యాఖ్యానించారు. బలం పెరుగుతుందే కానీ ప్రత్యేక రాష్ట్రం రాదన్నారు. కెవిపి, రేణుకా చౌదరిలాంటి వారి వల్ల తెలంగాణ పైన నిర్ణయం వాయిదా పడిందే తప్ప రాష్ట్ర ఏర్పాటు మాత్రం ఖాయమన్నారు. అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా ఉందన్నారు. కెవిపితో తెరాసతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఆంధ్రా నేతలతో కుమ్మక్కై తనను ఓడించాలని చూస్తున్నారన్నారు.

తన ప్రత్యర్థి ఎవరైనా తాను భయపడే ప్రసక్తి లేదన్నారు. ఏడాది ముందే అస్త్ర సన్యాసం చేసి ఎన్నికల కలలు కనడం సరికాదన్నారు. అలా చేయడం వల్ల బలం ఆ పార్టీ బలం మాత్రమే పెరుగుతుందని కెసిఆర్‌ను ఉద్దేశించి అన్నారు. తెలంగాణ కోసం పోరాడుతున్న తాను గెలువవద్దని ఆంధ్రా నేతలతో కుమ్మక్కవడం శోచనీయమన్నారు. అయినా తాను వెనక్కి పోయే ప్రసక్తి లేదన్నారు.

కెవిపి తీరు వైయస్సార్ కాంగ్రెసు పార్టీని బలోపేతం చేసే విధంగా ఉందన్నారు. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి, ఇతర ప్రజా సంఘాలు ప్రతి అంశాన్ని గుర్తించాలని కోరారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అమాయకంగా జగన్ వైపు వెళ్లే ఎమ్మెల్యేలకు వందల కోట్ల పనులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పార్టీ మారే గ్రేటర్ ఎమ్మెల్యేల జాబితాను తాను అధిష్టానానికి ఇచ్చానని చెప్పారు.

English summary
Nizamabad MP Madhu Yashki make controversisal comments on Telangana Rastra Samithi that party have links with Rajyasabha Member KVP Ramachandra Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X