హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మెదక్ వదలను, కెసిఆర్‌తోనైనా చర్చకి సై: రాములమ్మ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vijayashanthi
హైదరాబాద్: తాను మరెవరి కోసమో మెదక్ పార్లమెటు స్థానాన్ని వదులుకునే ప్రసక్తి లేదని తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి మంగళవారం అన్నారు. మెదక్ సీటును ఎవరికోసమూ వదులుకునేది లేదని ఆమె ఖరాఖండిగా చెప్పారట. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ లోక్‌సభ స్థానం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో పాటు కొత్తగా పార్టీలోకి రావటానికి సిద్ధంగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ కెవి రమణా చారి సైతం ఆసక్తిగా ఉన్నారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

దీనిపై ఆమె స్పందిస్తూ మెదక్‌ను వదులుకోనని చెప్పారట. "ఎన్నికలకు ముందు పార్టీలోకి ఐఏఎస్‌లో.. ఐపీఎస్‌లో.. పారిశ్రామికవేత్తలో వస్తే.. వారికోసం నా సీటును త్యాగం చేయాలా?'' అని ఆమె ప్రశ్నించారట. పార్టీ కోసం అందరి కంటే ఎక్కువగా తాను కష్టపడుతున్నానని చెప్పిన ఆమె "మెదక్ లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి బయటికంటే కొంత భిన్నంగా ఉంటుందని చెప్పారు.

ఇది ఉద్యమాలు జరిగిన ప్రాంతం. అదే సమయంలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, పారిశ్రామికవేత్తలు.. అణచివేతకు ప్రతీకలు. అలాంటిది ఒక ఉద్యమ పార్టీలోకి ఎవరు పడితే వాళ్లు వస్తే.. వారి కోసం సీటు ఖాళీ చేసేదిలేద''ని తేల్చి చెప్పారట. ఒకవేళ కెసిఆరే అక్కడి నుంచి పోటీ చేయాలని అనుకుంటే ఆయనతో చర్చిస్తానని కూడా రాములమ్మ తేల్చి చెప్పారట.

"గత ఎన్నికల్లోనూ కెసిఆర్, నేనూ ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై పార్టీలో కొంత తర్జన భర్జన జరిగింది. తమతోపాటు సీనియర్లు అందరూ కూర్చొని చర్చించాకే కెసిఆర్ మహబూబ్‌నగర్ నుం చి, నేను మెదక్ నుంచి పోటీ చేయాలని నిర్ణయించారు. ఇప్పుడూ అలాగే జరుగుతుందని ఆమె వివరించారట.

English summary
It is said that Medak TRS MP Vijayashanthi is not ready to leave Medak constituency for next general elections. Vijayashanthi is planning to contest from Medak second time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X