జగన్ అరెస్ట్ న్యాయపర విధానం: జెడి, నకిలీ ఫేస్ బుక్

CBI JD Laxmi Narayana
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టు విధానం న్యాయపరమైనదని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) అదనపు సంచాలకులు లక్ష్మీ నారాయణ గురువారం గుంటూరు జిల్లాలో అన్నారు. ఆయన ఈ రోజు జిల్లాలోని పలు సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు విషయాన్ని న్యాయస్థానాలు చూసుకుంటాయని ఆయన చెప్పారు. అరెస్టు అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు. ఆస్తుల కేసు పైన విచారణ జరుగుతోందని అన్నారు. విచారణ పూర్తయ్యాక ఛార్జీషీటు దాఖలు చేస్తామని, రాజకీయ ఆరోపణలపై తాము స్పందించమన్నారు.

కాగా, గుంటూరు నగరంలో పారిశుధ్యంలో ప్రథమ స్థానంలో ఉండాలని లక్ష్మీ నారాయణ పేర్కొన్నారు. గురువారం ఉదయం జరిగిన సంపూర్ణ పారిశుధ్యంపై అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులం, మతం పేరుతో ప్రజలు విడిపోతున్నారని, ప్రజలను కలిపితే ఎలాంటి సమస్యలు ఉండవన్నారు. సామాజిక కార్యక్రమాలతో ప్రజల మద్య ఐక్యత సాధించాలని లక్ష్మీ నారాయణ పిలుపునిచ్చారు.

జెడి పేర అనధికారిక ఫేస్ బుక్

సిబిఐ డైరెక్టర్ జెడి లక్ష్మీ నారాయణ పేరుతో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫేస్ బుక్‌ను ఓపెన్ చేశారు. అందులో జగన్ కేసు, ఛార్జీషీటుకు సంబంధించిన పలు అంశాలు ఉన్నాయి. జగన్ కేసు దర్యాఫ్తు పూర్తయ్యాక ఈడికి అప్పగిస్తామని అందులో వివరాలు ఉంచారు. త్వరలో ఛార్జీషీట్ వేస్తామని అందులో పేర్కొన్నారు. అయితే, ఇది లక్ష్మీ నారాయణ అధికారిక వెబ్ సైట్ కాదని అధికారులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+