రేణుకా చౌదరి ఇంటిపై కోడిగుడ్లు: కాంగ్రెస్ X జగన్ పార్టీ

రేణుక చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. ఈ వ్యాఖ్యలపై రేణుక తెలంగాణ ప్రజలకు భేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. తెలంగాణవాదులు పెద్ద ఎత్తున రేణుకా చౌదరి ఇంటిముందు ధర్నాకు దిగారు. పలువురు ఆమె ఇంటి పైకి కోడి గుడ్లు విసిరారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
మరోవైపు రేణుక దిగి వచ్చే వరకు తాము తమ ఆందోళనను విరమించేది లేదని తెలంగాణవాదులు హెచ్చరించారు. పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారి తీస్తుందని భావించిన పోలీసులు వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీంతో అక్కడ పరిస్థితి సద్దుమణిగింది. కాగా, తెలంగాణలో అన్ని ఆత్మబలిదానాలు కాదని, టిబి, జ్వరాలతో మరణిస్తే ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తున్నారని రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు.
కర్నూలులో జగన్ పార్టీ వర్సెస్ కాంగ్రెసు
కర్నూలు జిల్లా బేతంచర్ల మండలం పండ్లవారిపల్లెలో వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. డోన్ నియోజకవర్గంలో ఈ గ్రామం ఉంది. గురువారం ఇరు పార్టీలు రాళ్లు, కర్రలతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఆరుగురు కాంగ్రెసు, ఇద్దరు జగన్ పార్టీ కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు 144వ సెక్షన్ విధించారు.












Click it and Unblock the Notifications