ప్రతీకారం: రేపిస్టును తగులబెట్టి చంపిన మహిళ

సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి - భోలా ఠాకూర్ అనే 45 ఏళ్ల వ్యక్తి ఓ మహిళ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఆమె ఇంట్లో నిద్రిస్తోంది. ఆమె భర్త ఎప్పుడో చనిపోయాడు. మద్యం మత్తులో ఉన్న భోలా ఠాకూర్ ఆమెపై పడి అత్యాచారం చేశాడు.
ఆ తర్వాత కదలలేని స్థితిలో మత్తులో అక్కడే నిద్రపోయాడు. అవమానం భరించలేక మహిళ తొలుత తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది. కానీ ఆ తర్వాత మనసు మార్చుకుంది. నిద్రపోతున్న అతనిపై కిరోసిన్ పోసి నిప్పు అంటించింది.
ఈ సమయంలో ఆమె చీరకు నిప్పంటుకుంది. దాంతో ఆమె చీరను తీసేసింది. మంటలు అంటుకున్న భోలా ఠాకూర్ బయటకు పరుగు తీశాడు. ఇల్లు పూర్తిగా కాలిపోయింది. భోలా ఠాకూర్ మరణించాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మహిళను అదుపులోకి తీసుకున్నారు.
మృతుడికి నలుగురు కూతుళ్లు ఉన్నారు. ఈవ్ టీజింగ్, మహిళలపై వేధింపుకు సంబంధించి భోలా ఠాకూర్‌పై పలు కేసులున్నాయి. రెండేళ్ల క్రితం ఓ పాఠశాల బాలికపై అసభ్య ప్రవర్తనకు గాను రెండేళ్లు జైలులో ఉండి అతని తమ్ముడు ఇటీవలే బయటకు వచ్చాడు.












Click it and Unblock the Notifications