వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అద్వానీకి మళ్లీ ములాయం ప్రశంస: కాంగ్రెస్‌పై 'సిబిఐ'

By Srinivas
|
Google Oneindia TeluguNews

LK Advani - Mulayam Singh Yadav
లక్నో: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ పైన సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మరోసారి ప్రశంసలు కురిపించారు. ఇటీవల అద్వానీ నిజాలు చెబుతారని కితాబిచ్చిన ములాయం ఆయనను మరోసారి పొగిడారు. సోషలిస్టు నాయకుడు రామ్ మనోహర్ లోహియాను కీర్తిస్తూ అద్వానీ మాట్లాడటాన్ని ములాయం అభినందించారు. బుధవారం చిత్రకూట్‌లో ఉత్తర ప్రదేశ్ బిజెపి కార్యవర్గ సమావేశం జరిగింది.

ఇందులో అద్వానీ మాట్లాడుతూ... లోహియా, దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన అఖండ భారత్ భావనతో తాను ఏకీభవిస్తున్నానని చెప్పారు. ఈ సంద్రభంగా లోహియాను ప్రశంసించారు. ఈ విషయాన్ని లక్నోలో ములాయం సింగ్ వద్ద ప్రస్తావించగా... లోహియాను అద్వానీ ప్రశంసించి ఉంటే, అది మంచిదే కదా అన్నారు. మంచి నాయకుడిని కీర్తించాలని, తాను అద్వానీని ప్రశంసిస్తే అందరూ రాద్దాంతం చేశారని, మంచి చేసిన వారిని, చేస్తున్న వారిని అభినందించాల్సిందే అన్నారు. అంతేగానీ, వారిని కించపర్చాలా అని ప్రశ్నించారు.

అదే సమయంలో కాంగ్రెసుతో పోరాడితే జైలుకేనని ములాయం సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెసు కష్టాల్లో ఉన్నప్పుడు తాము మద్దతిచ్చామని, ఆ తర్వాత తన పైకి సిబిఐని ఉసిగొల్పారని ఆరోపించారు. కాంగ్రెసుకు వేయి చేతులు ఉంటాయని, వ్యతిరేకిస్తే సిబిఐని ప్రయోగిస్తుందని దాంతో పోరాడలేమన్నారు. ఆ పార్టీని ఓడించేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. ఇప్పటికైతే యుపిఏకు మద్దతు ఉపసంహరించనని చెప్పారు. లోకసభకు ఎప్పుడైనా ఎన్నికలు జరుగవచ్చునని అన్నారు.

ములాయంపై నోరు జారొద్దు

యూపిఏకు బయటి నుండి మద్దతిస్తున్న ములాయం సింగ్ యాదవ్ పైన విమర్శల దాడి ఆపాలని కేంద్రమంత్రి బేణి ప్రసాద్ వర్మకు కాంగ్రెసు సూచించింది. ఈ నేపథ్యంలో ఎస్పీ నుంచి తనపై దాడి ఎదురైతే తప్ప తాను అతనిని ఏమీ అనని బేణి నాయకత్వానికి హామీ ఇచ్చారట.

English summary
Samajwadi Party (SP) chief Mulayam Singh Yadav and Bhartiya Janta Party (BJP) veteran LK Advani on Tuesday predicted early Lok Sabha polls, which are scheduled to take place in 2014.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X