9 మందిని గొడ్డలితో నరికి చంపాడు, 5గురు స్త్రీలు

హత్యాకాండకు పాల్పడిన పాండు నగేసియా అనే 35 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బలరాంపూర్ జిల్లాలోని సామ్రీపథ్ పోలీసు స్టేషన్ పరిధిలో గల సామ్రీ గ్రామంలో అతను 9 మందిని నరికి చంపాడని పోలీసులు చెప్పారు. అతను హత్యాకాండకు ఎందుకు ఒడిగట్టాడనేది తెలియడం లేదు.
ఆ దారుణ సంఘటన గురువారం మధ్యాహ్నం ఒంటి గంటన్నర సమయంలో చోటు చేసుకుంది. పురుషులంతా గనుల్లో పనులకు వెళ్లిన సమయంలో రెండు మూడు కుటుంబాలకు చెందినవారు ఓ ఇంటి ముందు గుమికూడారు. ఆ సమయంలో అకస్మాత్తుగా నగేసియా దాడి చేశాడు.
మృతుల కుటుంబాలకు 25 వేల రూపాయలేసి నష్టపరిహారం చెల్లించనున్నట్లు బలరాంపూర్ జిల్లా కలెక్టర్ సిఆర్ ప్రసన్న చెప్పారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.












Click it and Unblock the Notifications