మహిళ నాలుకపై గుండు సూదులతో గుచ్చి హింస

దారుణంగా కొట్టారు. ఆమెకు పదివేల రూపాయల జరిమానా విధించారు. ఆమె భర్తపై ఒత్తిడి తెచ్చి భూమిని విక్రయించి జరిమానా చెల్లించేలా చేశారు. ఆ తర్వాత ఆమె నాలుక పైన సూదులతో దారుణంగా గుచ్చి హింసించారు. వారి హింసను భరించలేకపోయిన కళావతి మంగళవారం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె పన్నెండు మంది పైన ఫిర్యాదు చేసింది. పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
విద్యార్థిని హత్య కేసులో...
గుంటూరు జిల్లా తెనాలిలో మంగళవారం రాత్రి కారులో శవమై కనిపించిన విజయవాడ విద్యార్థిని సుష్మప్రియను కారు డ్రైవర్ పాల్ హత్య చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కేసులో ప్రధాన నిందితుడిని, ఆయన రెండో భార్య కోటేశ్వరి, స్నేహితురాలు మంగళవారమే పోలీసులకు చిక్కారు.
నిందితుడు చెబుతున్న విషయాలు పొంతన లేకపోవడంతో హత్య వెనుక అసలు కారణాలపై పోలీసులు నిర్ధారణకు రాలేకపోతున్నారు. పాల్ కారులో సుష్మప్రియను ఎక్కించుకొని విజయవాడలోనే తిరిగి అక్కడే హత్య చేసి తెనాలి వచ్చాడని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications