జగన్‌ పార్టీపై బొత్స ఫైర్: కెవిపిపై ధూళిపాళ్ల, బాబుపై జెసి

JC Diwakar Reddy
హైదరాబాద్: అధికారం కోసం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అడ్డదారులు తొక్కుతోందని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ధనికులు, దోపిడీదారులు, కార్పోరేట్ పెద్దలకు ప్రయోజనం చేకూర్చేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దీక్షలు చేపట్టిందని ఆయన శనివారం అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన విద్యుత్ బకాయిలను మాఫీ చేస్తున్నట్లు బొత్స తెలిపారు.

కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు పట్ల సిబిఐ ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తోందని తెలుగుదేశం శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్రచౌదరి విమర్శిచారు. కెవిపి బినామీలపై, చిరునామాలు లేని సంస్థలపై సిబిఐ విచారణ జరిపాలని ఆయన డిమాండ్ చేశారు. కెవిపి బంధువు రఘురామరాజును అరెస్టు చేసి విచారిస్తే కెవిపి బండారం బయటపడుతుందని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

అధికార దాహంతోనే వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వేషాలు వేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శానససభ్యులు, ఎమ్మెల్సీలు కరెంట్ చార్జీలు తగ్గించమనేందుకు దీక్ష చేస్తున్నారా, అనర్హత వేటు వేయించుకునేందుకా దీక్ష చేస్తున్నారా అని ఆయన అడిగారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిది వృధా యాత్ర అని కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు తెలుసుకునేదేం ఉంటుందని ఆయన అడిగారు. లోకసభకు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మార్పులు ఉండబోవని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీకి కొత్త రక్తం కావాలని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+