మాజీ ప్రేయసిని చంపిన టీచర్, పెళ్లికి ఒత్తిడి చేయడమే..

రాణి స్వస్థలం కృష్ణా జిల్లా మైలవరం మండలం చంద్రగూడెం గ్రామం. గుంటూరు జిల్లాలోని పొన్నూరు సమీపంలోని మునిపల్లెకు చెందినవాడు రాజశేఖర్. ఇద్దరు కలిసి కొంత కాలం కాపురం చేశారు. అయితే, రాణిని వదిలించుకోవడానకి రాజశేఖర్ ఆ కాలేజీని వదిలేసి ఓ పాఠశాలలో చేరాడు. తనను పెళ్లి చేసుకోవాలని రాణి అతనిపై ఒత్తిడి చేయసాగింది.
పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడని రాజశేఖర్ ఆమెను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. పిక్నిక్ పేరు చెప్పి పది రోజుల క్రితం అతను రాణిని సూర్యలంక బీచ్‌కు తీసుకుని వెళ్లాడు. పెళ్లి చేసుకోవాలని రాణి ఒత్తిడి చేయడంతో ముందుకు వేసుకున్న ప్రణాళిక ప్రకారం బీచ్‌లో అతను ఆమెను గొంతు నులిమాడు.
ఆ తర్వాత ఆమె గొంతు కోశాడు. శవాన్ని మత్స్యశాఖ భవనంలో పడేశాడు. సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత స్థానికులు శవాన్ని కనిపెట్టారు. విషయాన్ని పోలీసులకు చెప్పారు. బాధితురాలిని గుర్తు పట్టడానికి పోలీసులకు రెండు రోజులు పట్టింది. నేరాన్ని రాజశేఖర్ అంగీకరించినట్లు పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications