శ్రీనగర్‌లో బ్రిటిష్ మహిళ మృతి: రేప్‌గా అనుమానం

ఆ మహిళ దుస్తులు చిరిగి ఉన్నాయని, దీన్ని బట్టి మహిళపై అత్యాచారం జరిగి ఉంటుందనే అనుమానం కలుగుతోందని, అత్యాచారం చేసిన తర్వాత ఆమెను చంపి ఉంటారని పోలీసులు అంటున్నారు. డేవిట్ రిచర్డ్ (43) డచ్ యాత్రికుడు హౌస్‌బోట్‌లోని మరో గదిలో ఉంటున్నాడు.
శ్రీనగర్ - జమ్మూ జాతీయ రహదారిపై శ్రీనగర్‌కు 75 కిలోమీటర్ల దూరంలో గల ఖాజీగండ్ మీదుగా పారిపోవడానికి ప్రయత్నించిన అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ బృందం సంఘటనా స్థలానికి వచ్చింది. మహిళ శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. విదేశీ మహిళలపై ఇటీవల వరుసగా అత్యాచారాలు జరుగుతన్న సంఘటనలు చోటు చేసుకోవడానికి తీవ్ర కలవరానికి గురి చేస్తోంది.












Click it and Unblock the Notifications