జగన్‌కు మేకపాటి సోదరులు ముఖం చాటేస్తున్నారా?

YS Jagan - Mekapati Ranakohan Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి ముఖం చాటేస్తున్నారా? అనే చర్చ రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా సాగుతోంది. మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆయన సోదరుడు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర రెడ్డిలు మొదటి నుండి జగన్‌కు మద్దతుగా నిలిచారు.

కానీ, ఇటీవల మేకపాటి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ సత్యాగ్రహ దీక్షకు కూడా మేకపాటి ప్రాధాన్యత ఇవ్వలేదట. ఇందుకు అసంతృప్తే కారణమనే అప్పట్లోనే వార్తలు వచ్చాయి. కాంగ్రెసు పార్టీలో ఉండగా మేకపాటి సోదరుల హవా ఢిల్లీ స్థాయిలో ఉండేదంటున్నారు.

జగన్ పార్టీ పెట్టాక ఆయన వెంట వెళ్లారు. మొన్నటి వరకు జిల్లా పార్టీలో వారిదే హవాగా కొనసాగిందని అయితే, ఇటీవల వారికి ఎదురు తిరుగుతోందని అంటున్నారు. నెల్లూరి సిటీ, రూరల్ సమన్వయ కర్తల నియామకంపై వారు తీవ్ర మనస్థాపానికి గురయ్యారట. తాము సూచించిన వారికి కాకుండా ఇతరులను సమన్వయకర్తగా నియమించడంపై వారు ఆవేదన చెందుతున్నారట.

సమన్వయకర్తల నియామకంలో వైవి సుబ్బారెడ్డిదే పైచేయి అయిందంటున్నారు. దీంతో అసంతృప్తికి గురైన మేకపాటు జైల్లో ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డిని కూడా కలిసేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదట. గత నెల ఆయన సోదరుడు మేకపాటి చంద్రశేఖర రెడ్డి ఏకంగా సాక్షి పత్రిక పైనే అసంతృప్తి వెళ్లగక్కారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+