వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేప్‌నకు గురైన బాలిక అరెస్టు: సవతి తండ్రి రేప్

By Pratap
|
Google Oneindia TeluguNews

SC expresses anguish at UP government
న్యూఢిల్లీ: అత్యాచారానికి గురైన బాలికనే పోలీసులు అరెస్టు చేయడంపై సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తనపై అత్యాచారం జరిగిందంటూ ఫిర్యాదు చేయడానికి వచ్చిన పదేళ్ల బాలికను బులంద్‌శహర్ పట్టణంలోని మహిళా పోలీసు స్టేషన్ అధికారులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై మీడియాలో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించి సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.

బాలికను ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందో సోమవారం లోగా వివరణ ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి ఆల్తమాస్ కబీర్ నేతృత్వంలోని బెంచ్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఆదివారం జరిగిన బాలిక అరెస్టు ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ సమయంలో విధుల్లో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లను, మహిళా పోలీసుస్టేషన్ ఇన్‌చార్జ్, సబ్ ఇన్‌స్పెక్టర్లను విధులనుంచి తొలగిస్తూ పోలీసు శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, మధ్యప్రదేశ్ దతియా జిల్లాలోని దంగ్ కరేరా గ్రామ సమీపంలో ఐదుగురు వ్యక్తులు ఒక మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు బుధవారం తెలిపారు. అత్యాచారానికి పాల్పడ్డ వారిలో దాతియా మున్సిపల్ కౌన్సిల్‌కు చెందిన బీజేపీ కార్పొరేటర్ బాల్‌కిషన్ కుష్వహా కూడా ఒకరిని వారు చెప్పారు.

బాలికపై సవతి తండ్రి అత్యాచారం

మరోవైపు, పదేళ్ల బాలికపై సవతి తండ్రి అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లి ఇంట్లో లేని సమయం చూసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. మానసిక స్థితి సరిగా లేని మైనర్‌పై 19 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అన్నంపెడతానని చెప్పి అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. కాగా, తమిళనాడులో మొదటిసారి ఓ రేపిస్టును గూండా వ్యతిరేక చట్టంకింద అరెస్టు చేశారు. మూడేళ్ల చిన్నారిని లైంగికంగా వేధించాడంటూ షాహిస్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు.

తప్పుడు అత్యాచార ఆరోపణలతో తమ విలువైన జీవితాన్ని జైల్లో కోల్పోయినవారికి పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఢిల్లీలోని ఓ ఫాస్ట్ ట్రాక్ కోర్టు వ్యాఖ్యానించింది. హర్యానాకు చెందిన సుభాష్‌ను కిడ్నాప్, అత్యాచారం కేసులో నిర్దోషిగా ప్రకటించిన సందర్భంలో అదనపు సెషన్స్ జడ్జి వీరేందర్ భట్ ఈవ్యాఖ్యలు చేశారు. కాగా, తన మరదలిపై అత్యాచారానికి పాల్పడ్డ జస్పాల్ సింగ్ అనే వ్యక్తికి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ ఢిల్లీకోర్టు తీర్పునిచ్చింది.

English summary
Supreme Court expressed anfuis at Uttar Pradesh government for arresting a girl, who is a victim of rape. She has been arrested. when came to complaint about the crime meted out against her. 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X