వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హేమ, మాధురిలపై సెక్సీయెస్ట్ వ్యాఖ్య: మంత్రి ఔట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hema Malini
లక్నో: ప్రముఖ బాలీవుడ్ నటులు హేమ మాలిని, మాధురీ దీక్షిత్‌ల పైన సెక్సియెస్ట్ వ్యాఖ్యలు చేసినందుకు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తన మంత్రివర్గంలోని ఖాదీ, గ్రామోద్యోగ్ మినిస్టర్ రాజారామ్ పాండేకు ఉద్వాసన పలికారు. హేమ, మాధురీలపై వ్యాఖ్యలు చేసినందుకు పదవికి రాజీనామా చేయాలని అఖిలేష్ సదరు మంత్రిని శనివారం కోరారు.

ఇటీవల మంత్రి రాజారామ్ పాండే ప్రతాప్‍‌గఢ్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లాలోని రోడ్లను హేమ మాలిని, మాధురీ దీక్షిత్‌ల చెంపల వలె చేస్తానని వ్యాఖ్యానించారు. దీంతో ఆయన తన మంత్రి పదవిని పోగొట్టుకోవాల్సి వచ్చింది.

కాగా, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఇప్పటికే తన వద్ద 61 డిపార్టుమెంటులను ఉంచుకున్నారు. పాండే రాజీనామాతో ఇప్పుడు కొతంతగా ఖాదీ, గ్రామోద్యోగ్ బాధ్యతలు కూడా చూసుకోవాల్సి ఉంటుంది. పాండే వ్యాఖ్యలపై పలు రాజకీయ పార్టీలు, సోషల్ ఆర్గనైజేషన్స్ భగ్గుమన్నాయి.

ఎన్నికలకంటే అందాల పోటీ కాదు: జైరామ్ రమేష్

రాబోయే సార్వత్రిక ఎన్నికలు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి మధ్య పోటీ అన్న వాదనను కేంద్ర మంత్రి జైరాం రమేశ్ తోసిపుచ్చారు. ఎన్నికలంటే అందాల పోటీలు కాదన్నారు. భారత్‌లో ఎన్నికలు ఎప్పుడూ వ్యక్తుల మధ్య జరగవని, పార్టీలు పోటీ పడతాయని, ఎన్నికలంటే రాజకీయ పార్టీల మధ్య అందాల పోటీలు కాదని చెప్పారు. ఎన్నికలు షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాదే జరుగుతాయని తెలిపారు.

English summary
Rajaram Pandey, the Khadi and Gramodyog minister, has been sacked over his sexist remark against Bollywood actresses such as Hema Malini and Madhuri Dixit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X