'టి-కాంగ్' చర్చలు: కూతురు కోసం కావూరి లాబీయింగ్

Shabbir Ali-Kavuri Sambasiva Rao
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టమెంటు సభ్యులు పలువురు పార్టీ మారుతారనే ప్రచారం గల్లీ నుండి ఢిల్లీ వరకు ఆ పార్టీలో ప్రకంపనలకు గురి చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ గులాం నబీ ఆజాద్ శాసన మండలి సభ్యుడు షబ్బీర్ అలీని మధ్యవర్తిత్వానికి పురమాయించినట్లుగా తెలుస్తోంది. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ సూచనల మేరకు షబ్బీర్ అలీని మధ్యవర్తిత్వం వహించమని ఆజాద్ సూచించినట్లుగా తెలుస్తోంది.

షబ్బీర్ అలీ మంగళవారం పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు వివేక్ ఇంట్లో జానారెడ్డి, వివేక్, కె కేశవ రావు తదితరులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి అభిప్రాయాలను షబ్బీర్ అలీ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. భేటీ అనంతరం అలీ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేయాలన్న దానిపై తాము చర్చించామని, పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి పిలిస్తే తాను వచ్చానని చెప్పారు. కాగా, ఎమ్మెల్సీ డి శ్రీనివాస్ ఈ రోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు.

మాయలో పడవద్దు: దానం

తెలంగాణ ఇచ్చేది తెచ్చేది తమ పార్టీయేనని కాంగ్రెసు పార్టీ నేతలు పలుమార్లు చెప్పాలని, ఇలాంటి సమయంలో వారు కెసిఆర్ ఉచ్చులో పడవద్దని మంత్రి దానం నాగేందర్ సూచించారు. అధిష్టానం తెలంగాణపై ఓ నిర్ణయం తీసుకుంటుందని అప్పటి వరకు ఓపిక పట్టాలని సూచించారు. ప్రభుత్వం తెలంగాణకు వ్యతిరేకంగా లేదన్నారు. ఎంపీలు తొందరపడవద్దని కోరారు. వారు పునరాలోచించుకోవాలని సూచించారు.

కెసిఆర్‌పై టిడిపి ఫైర్

తెలంగాణ ప్రాంత కాంగ్రెసు, టిడిపి నేతలు చవటలు, దద్దమ్మలు అన్న కెసిఆర్ ఇప్పుడు వారి కోసం పడిగాపులు కాస్తున్నారని టిడిపి విమర్శించింది. నారదాసు కంటే గంగుల కమలాకర్ తెలంగాణవాదిగా కెసిఆర్ భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. తన కూతురు కల్వకుంట్ల కవిత కోసం కెసిఆర్ నిజామాబాద్ నుండి మధుయాష్కీని తిరస్కరిస్తున్నారని ఇది అవకాశం వాదం కాదా? అని ప్రశ్నించారు.

కూతురు కోసం కావూరి

ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు ఈ రోజు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు ఆయన మేడంతో భేటీ అయ్యారు. తన కూతురు నాగికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని ఆయన సోనియాను కోరినట్లుగా తెలుస్తోంది. మరోవైపు భారీ స్థాయిలో ఇళ్ల నిర్మాణపై ప్రతిపాదనలు ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+