అమానవీయం.. కారు ప్రమాదంలో కుటుంబం మృతి.. సొంతిల్లు లేకపోవటంతో ఏం జరిగిందంటే!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో మానవత్వం మంటగలిసిపోయిన ఘోర సంఘటన చోటు చేసుకుంది. కారు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన భర్త, భార్య, కుమారుడు ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. తర్వాత వారి మృతదేహాలను అద్దె ఇంట్లోకి రానివ్వకుండా ఇంటి యజమాని తాళాలు వేసి వెళ్లిపోవడం సమాజంలోని క్రూరత్వానికి అద్దం పడుతోంది.

రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

భద్రాచలం వెంకటేశ్వర కాలనీలో అద్దెకు నివసిస్తున్న దూడల సాయి ప్రకాష్ తన కుటుంబ సభ్యులతో ఆదివారం ములకలపల్లి నుంచి తిరిగి వస్తుండగా వారి కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దూడల సాయి ప్రకాష్, ఆయన భార్య దూడల సంధ్య, కుమారుడు దూడల మోక్షిత్ ముగ్గురూ సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృతదేహాలను పాల్వంచ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం పూర్తి చేసి, అంతిమ కార్యక్రమాలు నిర్వహించడానికి భద్రాచలంలోని అద్దె ఇంటికి తీసుకొచ్చారు.

Inhuman incident in bhadrachalam house owner locked the house said that not to bring deadbodies to his home

ఇంట్లోకి మృతదేహాలను తీసుకురావద్దన్న యజమాని

అయితే ఇంటి యజమాని మృతదేహాలను ఇంట్లోకి రానివ్వడానికి నిరాకరించాడు. ఇంటికి తాళాలు వేసి వెళ్లిపోయి,ఇంటిని కూల్చి వేస్తా కానీ మృతదేహాలను ఇంట్లోకి రానివ్వను అని హెచ్చరించాడు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు చాలా సేపు ఇంటి ముందు వేచి చూశారు. అయినా యజమాని మనసు మార్చుకోలేదు. చేసేది లేక మృతదేహాలను భద్రాచలం సమీపంలోని పురుషోత్తపట్నం గ్రామానికి తరలించి అంతిమ కార్యక్రమాలు నిర్వహించాల్సి వచ్చింది.

అమానవీయం.. మృతుల కుటుంబ సభ్యుల ఆవేదన

ఈ సంఘటన మానవత్వం పూర్తిగా కోల్పోయిన సమాజపు దారుణ స్థితిని బయటపెడుతోంది. ఒక వ్యక్తి మరణించిన తర్వాత కూడా అతని కుటుంబానికి చివరి ఘడియల్లో ఆశ్రయం నిరాకరించడం అతి దారుణమైన చర్య. ప్రస్తుత కాలంలో మానవత్వం మంట కలిసిపోయింది. ఇంట్లో ఉంటున్న వారు మరణిస్తే కనీసం అంతిమ క్రియలకు కూడా రానివ్వలేదని మృతుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థులకు శుభవార్త.. హైదరాబాద్ జీపీఓ మొబైల్ ఆధార్ సేవలు!
విద్యార్థులకు శుభవార్త.. హైదరాబాద్ జీపీఓ మొబైల్ ఆధార్ సేవలు!

మరణించిన వారి పట్ల కనీసం సానుభూతి లేని తీరు

ఈ ఘటన సమాజంలోని కొందరి అమానవీయ ప్రవర్తనను కళ్ళకు కట్టినట్టు చూపుతోంది. మరణించిన వారి పట్ల కనీసం సానుభూతి కూడా చూపని ఇలాంటి ప్రవర్తన చాలా చోట్ల కనిపిస్తుంది. భద్రాచలం ప్రజలు ఈ సంఘటనపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+