షర్మిలవి ఇవేం పెడబొబ్బలు!, అందరు గుడికెళ్తే..: బొత్స

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బొత్స మాట్లాడారు. ఏదైనా పార్టీలో చేరే ముందు ఎవరైనా సాధారణంగా గుడికి వెళ్తారని కానీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరాలంటే మాత్రం హైదరాబాదులోని చంచల్‌గూడ జైలుకు వెళ్లాలని ఎద్దేవా చేశారు. రాజన్న రాజ్యం అంటే ఇదేనా? అని ఆయన ప్రశ్నించారు. సబిత అరెస్టును డిమాండ్ చేస్తున్న షర్మిల తన సోదరుడు జగన్ అరెస్టు పైన మాత్రం పెడబొబ్బలు పెడుతున్నారని విమర్శించారు.
ఒకరు వెళ్లినా... కిరణ్
జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాల్లో కాంగ్రెసు పార్టీ గెలుపొందిందని అందులో ఒకరు పార్టీ నుండి బయటకు పోయినా మరో ఎనిమిది మంది ఉన్నారని ముఖ్యమంత్రి అన్నారు. సభలో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికను అడ్డుకునేందుకు విపక్షాలు అన్ని కలిసి ప్రయత్నించాయని ఆరోపించారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన హయాంలో బిసిలకు చేసిందేమీ లేదన్నారు. నడక మిత్రుడు చెప్పడమే తప్ప చేసేది లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసిలతో పాటు అన్ని వర్గాలకు కాంగ్రెసు సమన్యాయం చేస్తోందన్నారు. బిసిలకు ఈ బడ్జెట్‌లో రూ.4027 కోట్లు కేటాయించామన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్‌లు ఉంటాయన్నారు. టెక్కలిలో మహిళా కళాశాలను ఏర్పాటు చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications