జగన్ చిరంజీవి వారసుడు, అవినీతి కవలలు: టిడిపి

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, జగన్ అవినీతి కవలలు అని ఆయన వ్యాఖ్యానించారు. గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ మాఫియా అని విమర్శించారు. వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం అక్రమాలపై తమ పార్టీ గతంలోనే రాజా ఆఫ్ కరప్షన్ అనే పుస్తకాన్ని ప్రచురించిందని ఆయన గుర్తు చేశారు. వైయస్ జగన్ రాష్ట్రాన్ని దోచారని ఆయన ఆరోపించారు. ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాల నిందితుడు గాలి జనార్దన్ రెడ్డి ఆస్తులను జప్పు చేసి ప్రజలకు పంచిపెట్టాలని ఆయన కోరారు.
వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్లలో పేర్లున్న మంత్రులంతా రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. లేదంటే వారిని మంత్రివర్గం నుంచి తొలగించాలని ఆయన అన్నారు.
వైయస్, జగన్‌లకు మాత్రమే సాధ్యమైంది...
నాలుగేళ్లలో 40 వేల కోట్ల రూపాయలు దోచుకోవడం ప్రపంచ చరిత్రలో వైయస్ రాజశేఖర రెడ్డికి, ఆయన కుమారుడు జగన్‌కు మాత్రమే సాధ్యమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ వ్యాఖ్యానించారు. జగన్ అత్యాశ కారణంగా ఐఎఎస్ అధికారులు, పారిశ్రామికవేత్తలు నేరస్థులుగా మారి కోర్టులు, జైళ్ల చుట్టూ తిరుగుతున్నారని ఆయన గురువారం అనంతపురంలో మీడియా ప్రతినిధులతో అన్నారు.
చంబల్ లోయ దొంగల కన్నా దారుణంగా దోచుకున్న జగన్ వ్యవహారంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. సిబిఐ చార్జిషీట్‌లో ఉన్న హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంగా పదవిని పట్టుకుని వేలాడడం సరి కాదని అన్నారు. సబితా ఇంద్రారెడ్డికి సెల్యూట్ చేసేందుకు పోలీసు ఉన్నతాధికారులు బాధపడుతున్నారని నారాయణ అన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి నుంచి ప్రయోజనం పొందినవారు రుణం తీర్చుకోవడానికి తమ పార్టీలో చేరుతున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. కొంత మంది ఉద్దేశ్యపూర్వకంగానే విమర్శలు చేస్తున్నారని ఆయన తిరుపతిలో మీడియా ప్రతినిధులతో అన్నారు.












Click it and Unblock the Notifications