రెండు గంటలు కిరణ్ రెడ్డి మాయం: రహస్య చర్చలు

న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎవరికీ సమచారం ఇవ్వకుండా రెండు గంటల పాటు ఎవరికీ తెలియని చోటుకు వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయన గురువారం ఉదయం రెండు గంటల పాటు ఆయన మాయమయ్యారు. సెక్యురిటీ లేకుండా, ఎవరికీ చెప్పకుండా ఆయన ఓ ప్రైవేట్ వాహనంలో బయటకు వెళ్లిపోయారు.

ఎపి భవన్‌లో ఉన్న ఆయన సెక్యురిటీ సిబ్బందికి కనీస సమాచారం కూడా ఇవ్వకుండా బయటకు వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి ఎక్కడు వెళ్లారు, ఎవర్ని కలిశారు అనేది తెలియడం లేదు. ఈ విషయం తీవ్ర ఉత్కంఠకు కారణమైంది. ఆయన ముఖ్యమైన రహస్య భేటీలో పాల్గొన్నట్లు చెబుతున్నారు.

ముఖ్యమంత్రితో దుగ్గల్ భేటీ..

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్సి వికె దుగ్గల్ గురువారం ఎపి భవన్‌లో కలుసుకున్నారు. వివిధ అంశాలపై ఇరువురి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు చెబుతున్నారు. తెలంగాణపై ఏర్పాటైన శ్రీకృష్ణ కమిటీలో దుగ్గల్ సభ్యుడిగా ఉన్నారు. సమావేశాల నిర్వహణలో, ఇతర విషయాల్లో ఆయన శ్రీకృష్ణ కమిటీలో కీలక పాత్ర పోషించారు.

బొత్సతో డిఎస్ భేటీ...

ఢిల్లీ పర్యటనలో ఉన్న పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ సమావేశమయ్యారు. వీరిరువురి మధ్య చర్చకు వచ్చిన అంశాలేమిటనేది తెలియడం లేదు. పార్టీని, ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడానికి అవసరమైన చర్యల కోసం బొత్స సత్యనారాయణ, కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం నుంచి పార్టీ అధిష్టానం పెద్దలతో తెంపు లేకుండా భేటీలు జరుపుతున్న విషయం తెలిసిందే. బొత్స స్థానంలో డిఎస్ పిసిసి అధ్యక్షుడిగా వస్తారనే మాట కూడా వినిపిస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణకు ముందే డిఎస్ ఢిల్లీకి చేరుకున్నారు.

అధిష్టానానికి అత్యంత విశ్వాసపాత్రుడైన నాయకుడిగా డిఎస్ పేరు సంపాదించుకున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎవరికీ చెప్పకుండా అనూహ్యండా డిఎస్ పిసిసి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆ నియామకం గురించి బయటకు వెల్లడయ్యే వరకు కూడా డిఎస్ ఎక్కుడున్నారనేది ఎవరికీ తెలియలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+