మంత్రివర్గ విస్తరణ ఉండకపోవచ్చు: జెసి దివాకర్ రెడ్డి

మంత్రులదే బాధ్యత...
పాలనాపరమైన నిర్ణయాల్లో జరిగిన తప్పొప్పులకు బాధ్యత మూమ్మాటికీ మంత్రులదేనని మాజీ మంత్రి పాలడుగు వెంకట రావు అన్నారు. బుధవారం సీఎల్పీ కార్యాలయం వద్ద ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఒత్తిడి మేరకే తాము నిర్ణయం తీసుకున్నామంటూ తప్పించుకోవడం లేదా కేబినెట్ సమష్టి బాధ్యతంటూ నెపం మరొకరిపై నెట్టేయడం సరికాదని ఆయన అన్నారు.
ఏదైనా పాలనాపరంగా నిర్ణయాన్ని తీసుకునే సమయంలో తప్పని సరిగా మంత్రి బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. ఫలనా పనిచేయాలంటూ ముఖ్యమంత్రి ఒత్తిడి చేస్తే దానిని తిరస్కరించే అధికారం మంత్రికి ఉందని వివరించారు. అలా కాకుండా మంత్రిపదవిలో కొనసాగాలన్న కాంక్షతో ఫైళ్లపై సంతకాలు చేస్తే అందుకు మూల్యం కూడా చెల్లించాల్సి ఉంటుందని అన్నారు.
రాష్ట్రంలో ఇటు పార్టీ, అటు ప్రభుత్వంలో నెలకొన్న సమస్యలను స్థానికంగానే పరిష్కరించుకోవాల్సి ఉందని, దానికి అధిష్ఠానంపై నెపం వేయడం సమంజసం కాదని ఆయన అన్నారు. దీనికోసం ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి చేయడం సరికాదన్నారు. సభాపతి, శాసనమండలి చైర్మన్, ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు వంటి ప్రధాన పదవులన్ని ఒకే ప్రాంతానికి చెందిన వారికి ఇవ్వడం వల్ల ప్రాంతీయ సమతూకం దెబ్బతిందని అన్నారు.












Click it and Unblock the Notifications