జగన్ ఉప ఎన్నికల ఆరాటం: ఎమ్మెల్యేల పోరాటం

YS Jagan
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి ఆరాటపడుతున్నారు. ఇందుకు అనుగుణంగా తన వర్గానికి చెందిన కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల శానససభ్యుల రాజీనామాలను సాధ్యమైనంత త్వరగా ఆమోదింపజేసుకోవడమో, వారిపై వేటు పడేలా చూసుకోవడమో చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. అందుకు అనుగుణంగానే పార్టీ శానససభ్యులు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఉప ఎన్నికలకు సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది.

పార్టీల విప్‌లు ధిక్కరించిన తమ పార్టీల శాసనసభ్యులపై తెలుగుదేశం, కాంగ్రెసు ఫిర్యాదు చేశాయి. ఈ ఫిర్యాదులపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ శానససభ్యులకు నోటీసులు జారీ చేశారు. నోటీసులకు వివరణ ఇచ్చే గడువు కూడా ముగిసింది. తమపై సాధ్యమైనంత త్వరగా వేటు వేయించుకోవడానికి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ తిరుగుబాటు శానససభ్యులు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని వారు సూటిగానే స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు చెబుతున్నారు.

స్పీకర్ వారిపై వేటు వేసి ఖాళీలను ప్రకటిస్తే ఆరు నెలలలోగా ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే, ఏడాది లోపల సార్వత్రిక ఎన్నికలు జరపాల్సి ఉంటే మరో ఆరు నెలల పాటు వాటిని ఖాళీగా పెట్టవచ్చు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి అధికార కాంగ్రెసు పార్టీ సిద్ధంగా లేకపోవడంతో తమపై వేటు వేయడంలో స్పీకర్ జాప్యం చేస్తారని వైయస్ జగన్ వర్గానికి చెందిన శానససభ్యులు భావిస్తున్నారు. దీంతో స్పీకర్‌పై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

గురువారంనాడు తెలుగుదేశం పార్టీకి చెందిన తిరుగుబాటు శానససభ్యుడు కొడాలి నాని, కాంగ్రెసు తిరుగుబాటు శాసనసభ్యులు పేర్ని నాని, మద్దాల రాజేష్ కలిసికట్టుగా స్పీకర్ వద్దకు వచ్చి వివరణ ఇచ్చారు. ఆ తర్వాత కాంగ్రెసు తిరుగుబాటు శాసనసభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పీకర్‌ను కలిసి వివరణ ఇచ్చారు. తనపై త్వరగా వేటు వేయాలని, ఉప ఎన్నిక జరిగేలా చూడాలని ఆయన అన్నారు.

అయితే, ఏడాది లోపల జగన్ వర్గానికి చెందిన శానససభ్యులపై స్పీకర్ వేటు వేసే సూచనలు కనిపించడం లేదు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలం తగ్గుతోందనే మాటలు వస్తున్న తరుణంలో ఉప ఎన్నికలను ఎదుర్కుని సత్తా చాటాలని జగన్ అనుకుంటున్నారు. కానీ, ఆ అవకాశం వచ్చేలా లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+