వైయస్ ఫ్యామిలీపై విమర్శలా: అనంపై బాజిరెడ్డి

రాష్ట్ర మంత్రులంతా పక్కా ప్రణాళికతో రోజుకొకరు వైయస్సార్ కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఆనాడు వైయస్ అండ లేకపోయి ఉంటే ఆనం ఎక్కడ ఉండేవాడో ఆలోచించుకోవాలన్నారు. నెల్లూరు జిల్లాలో రాజకీయంగా బలంగా ఉన్న నెదురుమల్లి జనార్దన్‌రెడ్డి నుంచి ఆనం కుటుంబాన్ని కాపాడి ఈ స్థాయికి తీసుకువచ్చిన ఘనత వైయస్‌దేనని అన్నారు.
ప్రస్తుతం ఆనం ఆరోపణలు ఊసరవెల్లిని మరిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు చెల్లని నాణాలని ఆయన విమర్శించారు. కామారెడ్డ్డి ఉప ఎన్నికల ప్రచారంలో మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని గొప్పలు చెప్పిన సర్వే సత్యనారాయణ ప్రస్తుతం మంత్రి పదవిని అనుభవిస్తున్నారని ఎద్దేవా చేశారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై బాజిరెడ్డి గోవర్ధన్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. వైయస్ విజయమ్మ, షర్మిలలపై కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications